జిల్లా కేంద్రంలో ని  న్యూటౌన్ ప్రధాన రహదారి వద్ద కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను  దగ్ధం చేసారు.  మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాంలో పార్టీ ఫిరాయింపులు, టీపీసీసీ నేత భట్టి విక్రమార్క్ ధీక్షను పోలీసులు భగ్నం చేయడంపై నేతలు మండిపడ్డారు. డిసిసి అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్  మాట్లాడుతూ ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన రాజ్యాంగ బద్దులే ప్రజాస్వామ్య బద్దులే ఉండాలని అన్నారు.

కెసిఆర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇష్టం వచ్చినట్టు రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించారిన విమర్శించారు. . గతవారం క్రింద ఎమ్మెల్యేలను మభ్యపెట్టి  టిఆర్ఎస్ పార్టీలో చేర్చు కోవడం జరిగింది కానీ దీనికి సంబంధించిన అంశం హైకోర్ట్ స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉన్నందున దీని ఆపమని, రాజ్యాంగ విరుద్ధమని, సీఎల్పీ నేతశ్రీ మల్లు భట్టి విక్రమార్క  ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేసినందుకు వారిని  పోలీసు ల తో అరెస్టు చేసి నిమ్స్ కు  తరలించడం జరిగింది.

దీని నిరసనగా నేడు కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం చేయ వలసి వచ్చిందనీ తెలియజేశారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తే ఈ సమాజం బాగుపడుతుందని ప్రజల కోసం నిరంతరం కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నా రు. ఈరోజు పార్టీలకతీతంగా ప్రజాస్వామ్యం వాదులంతా ఏకమై అధికార పార్టీని  కట్టడి చేయ వలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ  కార్యక్రమంలో డిసిసి సీనియర్ నాయకులు ముత్యాల ప్రకాష్,  పీసీసీ కార్యదర్శి ఎన్.పి. వెంకటేష్, పిసిసి అధికార ప్రతినిధి జి హర్షవర్ధన్ రెడ్డి, సత్తూరు చంద్ర కుమార్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి కట్ట రవి కిషన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, మీడియా సెల్ బెనహార్,అనంత్ రెడ్డి,డీసీసీ సెక్రెటరీ సిరాజ్ కాద్రి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కంచిమీ లక్ష్మణ్, పట్టణ ఉపాధ్యక్షుడు రవుఫ్, పట్టణ మైనారిటీ అధ్యక్షుడు అజ్మత్ అలీ,మైనారిటీ కన్వీనర్ షేక్ ఉమార్, బాలస్వామి,సుభాష్ కత్రి, టౌన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఖాదర్, ఆటో యూనియన్ అధ్యక్షుడు రాములు యాదవ్, అద్దానీ హరినాథ్,టౌన్ ఉపాధ్యక్షుడు ఏం.ఏ అలీమ్, నాగరాజ్,సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: