2014 ఎన్నికలకు రెండు నెలల ముందు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించాడు. ఎన్నికల్లో జనసేన టీడీపీకి మద్దతివ్వడం ఎన్నికల్లో టీడీపీ గెలవడం జరిపోయాయి. 2014 ఎన్నికల జరువాత జనసేన పార్టీని ప్రజల్ల్లొకి బలంగా తీసుకువెళ్ళటంలో పార్టీ అధినాయకుడు పవన్ కల్యాణ్ ఇంకా కృషి చేసి ఉంటే బాగుండేది

 

జనసేన పార్టీ ఇప్పటికే గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ స్థాయిలో బలంగా ఉండాలి కానీ పార్టీ దిశగా ఎందుకో ప్రయత్నాలు చేయలేదు గ్రామ, మండల స్థాయిలో బలమైన నాయకుల్ని, కార్యకర్తల్ని నియమించుకుని పార్టీ నాయకులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉందేలా చేస్తూ ప్రజలకు సేవలు అందించిన నాయకులకే సీట్లు ఇచ్చి ఉంటే బాగుండేది.

 

కానీ ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావిడిగా కసరత్తు ప్రారంభించడం వల్ల సరైన ఫలితాలు దక్కలేదు. జనసేన పార్టీ లో పవన్ కల్యాణ్ మాత్రమే కాకుండా జిల్లాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకుల్ని నియమించుకోవాలి. వారి ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ సరైన అభ్యర్థుల్ని ప్రత్యర్థులకు పోటీ ఇవ్వగల అభ్యర్థుల్ని నియమించాలి. ప్రణాళిక జనసేన ఆచరిస్తే తప్పనిసరిగా భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంటుంది జనసేన


మరింత సమాచారం తెలుసుకోండి: