జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన రోజు నుండి ఏ శాఖలోను అవినీతికు తావు లేకుండా పనులు జరగాలని ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారులను ఆదేశించారు. అతి త్వరలోనే ఒక టోల్ ఫ్రీ నంబర్ ను కూడా అవినీతి గురించిన ఫిర్యాదుల కోసం ప్రజలకు అందుబాటులో ఉంచబోతున్నారు.


అవినీతి రహిత సమాజం వైపు జగన్ చేస్తున్న ఆలోచన గొప్పది. ఆచరణలో సమస్యలున్నా ముందడుగు వేస్తే రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది.అవినీతి చేసిన అధికారులకు మంత్రి పదవి నుండి తప్పిస్తానన్న జగన్ నిర్ణయం చాలా గొప్పది. ఏ శాఖలోనైనా అవినీతి జరిగినట్లు తేలితే ఆ శాఖకు కొత్త మంత్రిని నియమిస్తానన్న జగన్ ఆలోచన తన పరిపాలన ద్వారా ప్రజలకు ఎంత మేలు చేయాలనుకున్నాడో తెలిసేలా చేస్తుంది.

 

ఈ అవినీతి జరగని రోజున రాష్ట్రంలోని రైతులు, చిరుద్యోగులు, దారిధ్ర్యరేఖకు దిగువున ఉన్న పేదవారు, నిరుద్యోగులు సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించుకుని వారి భవిష్యత్తును మార్చుకుంటారు. అవినీతి చేసే అధికారులకు కూడా మరింత కఠినతరమైన నిబంధనలు రూపొందిస్తే మన రాష్త్ఱం అవినీతి రహితంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: