చంద్రబాబును అందరూ ముద్దుగా యూ-టర్న్‌ బాబు అని పిలుస్తుంటారు. పూటకో మాట, రోజుకోమాట చెబుతుండటంతో అందరూ బాబును ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. అయితే  మాట మీద నిలబడటం చంద్రబాబుకి తెలియని విద్య. పూటకో మాట మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. యూ-టర్న్‌లు తీసుకోవడంలో ఆయనకి ఆయనే సాటి. లేకపోతే, ఆరు నెలలపాటు వైఎస్సార్సీపీ పాలనకు సంబంధించి విమర్శలు చేసే విషయమై అత్యుత్సాహం ప్రదర్శించబోమని చెప్పిన చంద్రబాబు, అప్పుడే టీడీపీ శ్రేణుల్ని వైఎస్సార్సీపీ మీదకు ఉసిగొల్పాలనుకోవడమేంటి.? 


మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కుటుంబ సభ్యులపై కుప్పలు తెప్పలుగా కేసులు నమోదవుతుండడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు హయాంలోనే కోడెల కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. నిజానికి, అంతకు ముందూ కోడెల శివప్రసాద్‌కి, ఆయన కుటుంబ సభ్యులకీ గుంటూరు జిల్లాలో ఘనమైన 'చెత్త' చరిత్ర వుందన్నది నిర్వివాదాంశం.


కేసులే నమోదయ్యాయి.. ఇంకా అరెస్టుల దాకా వ్యవహారం వెళ్ళనే లేదు. ఈలోగా చంద్రబాబు యాగీ షురూ అయ్యింది. 'ఇంకా చాలామంది నేతలపై కేసులు నమోదవుతాయి.. అప్రమత్తంగా వుండాలి.. ధైర్యంగా ఎదుర్కోవాలి..' అంటూ చంద్రబాబు పార్టీ నేతలకు 'ధైర్యం' నూరిపోసే క్రమంలో, వారిలో భయాన్ని పెంచేస్తున్నారు. 'ఈ పరిస్థితుల్లో మీరు పార్టీలో వుండలేరేమో.. పార్టీ మారే ఆలోచన చేయండి..' అని చంద్రబాబే సంకేతాలు పంపుతున్నట్టుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: