అసెంబ్లీలో ఈసారి ఎన్నో చిత్రాలు కనిపిస్తాయి. కొత్త ప్రభుత్వం అంతా కొత్తదనం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో వైపు అందరి చూపు ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఇద్దరు నేతలు ముఖాముఖాలు చూసుకుని కచ్చితంగా రెండేళ్ళకు పై మాటే మరి.


జగన్ ఈసారి అసెంబ్లీకి ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు. ఆయన ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని తెల్లారిలేస్తే ఒకటికి పదిసార్లు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మొన్నటివరకూ  అంటూ ఉండేవారు. ఆ మాటలు ఈ అయిదేళ్ళలో కొన్ని లక్షల సార్లు విన్న ఏపీ జనం జగన్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడంటూ కసిగా ఓట్లు కుమ్మేసి మరీ జగన్ కి బంపర్ విక్టరీ అందించారు.


దాంతో జగన్ 151 ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వస్తున్నారు. దర్జాగా మహారాజుగా జగన్ స్పీకర్ కి కుడివైపున ఉన్న సీఎం సీట్లో ఆసీనులవుతారు. ఇక ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎడమవైపు సీట్లో విపక్ష నేత హోదాలో దర్శనమిస్తారు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ అని పాడుకోవడమే ఇపుడు తమ్ముళ్లకు మిగిలిన పాటలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: