ఏపీలో పన్నెడు రోజుల పాలనలోనే తన విధానం ఏంటో చెప్పేసి దూకుడుగా ముందుకు సాగుతున్న వైసీపీ అధినేత జగన్ ఇపుడు డైనమిక్ సీఎం అయిపోయారు. ఆయన దగ్గరకు ఓ సమస్య రావడమే తరువాయి వెంటనే పరిష్కారం లభిస్తోంది. దీంతో జగన్ని విపక్ష నేతలు సైతం పొగుడుతున్నారు.


ఇదిలా ఉండగా జగన్ ఏపీకి హోదా సాధించి తీరుతారని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ సైతం తన అజెండాలో అది మొదటి ప్రయారిటీ కింద పెట్టుకున్నారు. ప్రధాని ఎపుడు వచ్చినా కూడా ఆయన ఇదే డిమాండ్ ముందుకు పెడుతున్నారు.  దీంతో ఇపుడు వైసీపీ పట్ల సానుకూలంగా ఉన్న బీజేపీ, మోడీ సైతం ఏపీలో జగన్ ఇబ్బందులు పడకుండా చూడాలనుకుంటునట్లు సమాచారం. అదే విధంగా ఏపీలో మళ్ళీ టీడీపీ రాజకీయంగా లేవకుండా చేయాలనుకుంటొందని టాక్. 


అందువల్ల ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వడానికి మోడీ సర్కార్ సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్క ఏపీకి ఇవ్వకుండా బీహార్, ఒడిషాలకు కూడా ఇచ్చేసి హోదా వివాదాలకు ఇంతటితో ముగింపు  పలకాలనుకుంటున్నట్లు టాక్.  అదే జరిగితే జగన్ కి ఏపీలో తిరుగు ఉండకపోవచ్చు. రాజకీయంగా టీడీపీకి, ప్రతిపక్షాలకు పెద్ద దెబ్బ పడిపోయినట్లే. ముఖ్యంగా టీడీపీకి ఇది కోలుకోలేని శరాఘాతమే అవుతుంది.
 



మరింత సమాచారం తెలుసుకోండి: