దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టి ఎంతోమందిని కీలక స్థానాల్లోకి తీసుకు వెళ్లారు. ఇలాంటి వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన జూపూడి ప్రభాకర్ రావు ఒకరు. జూపూడి ప్రభాక‌ర్‌రావు వైఎస్ మరణానంతరం వైఎస్.జ‌గ‌న్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. జగన్ పై ఆయన మాట‌ప‌డ‌నిచ్చే వారు కాదు. మీడియాలోనూ బయట వైసిపికి బలమైన గొంతుగా మారి జగన్మోహన్ రెడ్డి పై ఎవరైనా విమర్శలు చేస్తే బలంగా తిప్పి కొట్టే వారు. జగన్ జూపూడి ప్రభాకర్రావును ఎంతో నమ్మారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని కొండ‌పి అసెంబ్లీ సీటు ఆయనకు కేటాయించారు. ఆ ఎన్నికల్లో జిల్లాలో ఉన్న మరో రెండు రిజర్వుడు సీట్లు అయిన ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గంలో వైసీపీ గెలిచిన జూపూడి తప్పిదాల వల్లే కొండ‌పిలో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోవడం అటు వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో జూపూడి అధికారదాహంతో తపించి పోయారు. ఏదో ఒక పదవి వస్తే చాలు అనుకునినే సైకిల్ ఎక్కేసి చంద్రభజన ప్రారంభించేశారు. జగన్ ఎంతో నమ్మిన వ్యక్తి కాస్త జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ప్రారంభించారు. జూపూడి తన భజన చేయడంతో మెచ్చుకున్న చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి తో పాటు... రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. విచిత్రం ఏంటంటే ఆ పదవిలో ఉండగా కూడా జూపూడి ప్రభాకర్ రావు విపరీతమైన చంద్ర భజన చేయడంతో పాటు.... రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ చంద్రబాబుని
చంద్ర భజన చేయాలని కంకణం కట్టుకొని పని చేశారు. 


ఎస్సీ కార్పొరేషన్ రుణాల కింద ఇచ్చిన కార్లకు చంద్రబాబు స్టిక్కర్ వేయాలని... లేకపోతే ఆ కార్ల‌ను వెనక్కి తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన ఘనత దక్కుతుంది. చివరకు ఇప్పుడు టిడిపి ఓడిపోవడంతో జూపూడి తన పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన జూపూడి ఇప్పటివరకు అదే పార్టీలో కొనసాగి ఉంటే కచ్చితంగా ఎస్సీ కోటాలో ఆయనకు కీలకమైన మంత్రి పదవి దక్కేది. జగన్ తనకు ఇచ్చిన ప్రయారిటీ ని కూడా వదులుకొని పదవి కోసం పాకులాడిన జూపూడి ఇప్పుడు రాజకీయంగా తీవ్రమైన సంకట స్థితిలో పడిపోయారు.



మరింత సమాచారం తెలుసుకోండి: