తెలుగుదేసం పార్టీ 2019 ఎన్నికల తరువాత  ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.  శాసనసభ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు  ఎంపికయ్యారు.  చంద్రబాబు తరువాతి స్థానం.. అంటే.. డెప్యూటీ ప్రతిపక్ష నేతగా ఎవరిని నియమిస్తున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది.  ముగ్గురు డిప్యూటీ ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయబోతున్నారని తెలుస్తోంది.  

ఆ ముగ్గురు ఎవరు ఎవరికీ ఆ పదవి   దక్కబోతోంది అన్నది క్యూరియాసిటీ కలిగింది.  విప్ ఎవరు అనేది చంద్రబాబు నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రతిపక్షానికి దక్కే పీఏసీ చైర్మన్ పోస్టు టీడీపీలో ఎవరికి దక్కుతుందన్న అంశంపై టీడీపీలో ఆసక్తి నెలకొంది. పీఏసీ ఛైర్మన్ పదవి కోసం తెలుగుదేశంలో తీవ్రమైన పోటీ ఉందని సమాచారం.

కరణం బలరాం, గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్.. పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాగా విప్‌గా పయ్యావుల కేశవ్‌ను ఎంపిక చేస్తారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. ఇక డిప్యూటీ లీడర్లుగా చినరాజప్ప, గంటా, అచ్చెన్నాయుడు, కరణం బలరాం, బుచ్చయ్య చౌదరి పేర్ల పరిశీలనకు వచ్చాయని సమాచారం.

ఎవరికి పదవులు ఇస్తున్నారు అనే దానిపై జోరుగా పందేలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.  ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతన్న నేపథ్యంలో ఈ పదవులపై ఆసక్తి పెంచుకున్నారు టిడిపి ఎమ్మెల్యేలు.  అధికారంలో లేకపోయినా కనీసం ఇలాంటి పదవులైన ఉన్నాయని సంతోష  పడొచ్చని టిడిపి నేతల అభిప్రాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: