చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ 2019 ఎన్నికల్లో తీవ్రమైన ఓటమిని చవిచూసింది.  1982 లో స్థాపించిన పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ఘోరమైన ఓటమిని ఎప్పుడు చూడలేదు.  ఓటమి ఈ స్థాయిలో ఉంటుందని కూడా ఊచించలేదు.  

2019 లో కనీసం 50 పైగా స్థానాలు వస్తాయని టిడిపి లోపల అంచనా వేసుకుంది. వైకాపా కు మా వస్తే 120 వరకు రావొచ్చు అనుకుంది.  కానీ, అనూహ్యంగా ఈ స్థాయిలో ఫలితాలు ఉంటాయని పాపం అసలు ఎక్స్పెస్ట్ చేయలేదు టీడీపీ.  దీంతో ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి సిదాం అయ్యింది.  

వీలైనంత త్వరగా ఓటమిబాధ నుంచి బయటకు వచ్చి పార్టీని తిరిగి కాపాడుకోలేకపోతే కోలులోలేమని బాబుకు అర్ధమైంది.  అందుకే బాబు ప్లాన్ బి రెడీ చేసుకున్నారని సమాచారం.  అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక.. బాబు ఈ ప్లాన్ బి ని అమలు చేయబోతున్నారు.  ప్రజల మధ్యలోకి వెళ్లి, టిడిపి కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వాలని అనుకుంటున్నారు.  

ఏ పార్టీకైనా కార్యకర్తలు బలం.  అందుకే వాళ్లకు ముందు అండగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తూ.. పార్టీని సంస్థాగతంగా తిరిగి బలోపేతం చేసి.. రాబోయే ప్రాదేశిక ఎన్నికల నాటికి తిరిగి పుంజుకోవాలని చూస్తున్నారు.  దీనికోసం ప్రజల్లో కి వెళ్లాలని, ప్రజల మధ్య తిరగాలని అనుకుంటున్నట్టు సామాచారం.  ఇప్పటికే బాబుకు చాలా వయసు వచ్చింది.   ఈ సమయంలో బాబు ఇలా యాత్రలు చేయడం అవసరమా అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: