ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డి కూర్చున్న చాంబర్ కోసం, వైఎస్సార్ఎల్పి కార్యాయలం కోసం తెలుగుదెశంపార్టీ పట్టుబడుతోంది. వర్షం వచ్చినపుడల్లా జగన్ చాంబర్లో నీళ్ళు కురిసేదన్న విషయం అందరికీ తెలిసిందే. తమకు మంచి చాంబర్ వేరేది చూపించమని జగన్ అండ్ కో ఎన్నిసార్లు కోరినా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు.

 

జగన్ ను అవమానించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు అండ్ కో ఆ చాంబర్ తప్ప మరోటి కేటాయించటానికి ఇష్టపడలేదు. పైగా జగన్ చాంబర్ లో నీళ్ళు కారటానికి వైసిపి వాళ్ళు పైపులు కోసేయటమే కారణమంటూ ఎదురుదాడి కూడా చేశారు. మొత్తానికి కావాలనే జగన్ చాంబర్ విషయంలో గందరగోళంగా వ్యవహరించింది.

 

సరే అదంతా చరిత్ర అనుకోండి అది వేరే సంగతి.  సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించటంతో జగన్ సిఎం అయ్యారు. దాంతో అప్పట్లో జగన్ కూర్చున్న చాంబర్ తమకు కేటాయించాలని, అలాగే వైఎస్సార్ఎల్పి కార్యాలయాన్ని కూడా తమకు కేటాయించాలంటూ ఇపుడు టిడిపి పట్టుబట్టడం విచిత్రంగా ఉంది.

 

వర్షం వస్తే నీళ్ళు కారే చాంబర్ టిడిపికి ఎందుకయ్యా అంటే ఆ చాంబర్లో ఉండే జగన్ సిఎం అయ్యారు కాబట్టి వాస్తు బాగుందట. అందుకనే ఆ చాంబర్ కోసం ఇపుడు చంద్రబాబు అండ్ కో పట్టుబడుతున్నారు. అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తాను సిఎం కాకపోతానా అన్న ఆశ అప్పుడే మొదలైపోయింది.

 

ఇక వైసిపి విషయానికి వస్తే అప్పట్లో జగన్ చాంబర్ కానీ వైఎస్సార్ఎల్పీ కార్యాలయాన్ని కానీ వదులుకోవటానికి ఇష్టపడటం లేదు. అప్పటి కార్యాలయాన్నే తాము కంటిన్యు చేసే ఉద్దేశ్యంలో వైసిపి ఉంది. ఇక టిడిఎల్పి కార్యాలయం అంటారా అసెంబ్లీ స్పీకర్ ఎక్కడో ఓ చోట చూపించకుండానే ఉంటారా ? చూడాలి ఈ వాస్తు వ్యవహరాలు ఏ విధంగా ముగుస్తాయో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: