పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జీవితాన్ని పక్కన పెట్టి జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలని అనుకున్నాడు. అధికారంలోకి రాకపోయినా కనీసం కొంతమేర ప్రభావం చూపుతారేమో అనుకున్నారు.  అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి.  


పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు.  ఒకటి భీమవరం నుంచి కాగా రెండోది గాజువాక నుంచి.  పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓటమిపాలయ్యారు.  దీంతో పవన్ కళ్యాణ్ పార్టీ పని అయిపోయిందని అనుకున్నారు.  పవన్ మాత్రం ప్రాదేశిక ఎన్నికల నాటికి ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలని సంకల్పించుకున్నారు.  


ఇదిలా ఉంటె, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పై విజయం సాధించిన వైకాపా నేత గ్రంధి శ్రీనివాస్ కు తప్పకుండా మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది.  అందరు అలానే ఊహించారు.  కానీ, అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి.  పవన్ కళ్యాణ్ పై గెలిచిన గ్రంధి శ్రీనివాస్ కు పదవి దక్కలేదు.  


మంత్రి  పదవి దక్కకపోవడంపై గ్రంధి శ్రీనివాస్ కొన్ని కామెంట్స్ చేశారు.  పవన్ పై గెలిచిన తరువాత తనకు మంత్రి పదవి వస్తుందని అనుకున్న మాట వాస్తవమే కానీ, సామాజిక సమీకరణాల వలన పదవి దక్కలేదు.  జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని గ్రంధి శ్రీనివాస్ చెప్పడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: