మొన్న జరిగిన మంత్రివర్గం విస్తరణ సమయంలో రోజాకు మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు.  కానీ, ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వలేదు.  రోజాకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారని అనేక వార్తలు, కథనాలు మీడియాలో వెలువడ్డాయి.  ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.  


పైగా ఇలాంటి వార్తలు ప్రచారం చేయడంలో మీడియా ఉద్దేశ్యంతో ఏంటో అర్ధం కావడం లేదని, మీడియా తన మంత్రి పదవి విషయంలో ఎందుకు అంత ఫోకస్ చేసిందో తెలియదని అంటోంది రోజా.  తనను జగన్ పిలిచారం.. అయితే, ఎమ్మెల్యేగా మంత్రుల ప్రమాణస్వీకారం రోజున అవసరం లేదని చెప్పి హైదరాబాద్ వెళ్లినట్టు చెప్పింది.  


తనకు ఫుల్ క్లారిటీ ఉందని, జగన్ ఏం చేసినా అందరికి మంచి జరిగే విధంగా చేస్తారని చెప్పింది.  వైకాపా అధికారంలోకి రావాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలని తొమ్మిది సంవత్సరాలపాటు కష్టపడ్డామని చెప్పింది. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారని.. మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వడం లేదు అన్నది ఇప్పుడు అనవసరం అని రోజా చెప్పింది.  


రోజాకు ఈ మాత్రం ఫుల్ క్లారిటీ ఉంటె చాలు.  అంతేకంటే కావాల్సింది ఏముంటుంది.  2024 లోను జగన్ ముఖ్యమంత్రి అవుతాడని రోజా చెప్పడం విశేషం.  ఇచ్చిన హామీలను తప్పకుండా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని రోజా చెప్పింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: