Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 12:07 pm IST

Menu &Sections

Search

మానవ వికాసానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా ?

మానవ వికాసానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా ?
మానవ వికాసానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సామాజిక విశ్లేషకులు Siddharthi Subhas Chandrabose . మానవ వికాసానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదని  అంటారు ...
'' జగన్ , ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు, మంత్రివర్గ కూర్పు సరికొత్త, యవ్వనత్వపు,
ఆధునిక, అభ్యుదయ పోకడతో కూడిన పాలనకు బాటలు వేస్తాయని విశ్వసిస్తూ, గత ప్రభుత్వం అన్నివనరులు, శక్తులూ కేంద్రీకరించి
అన్ని ప్రాంతాల అభివృద్దిని పణంగా వొడ్డి నిర్మించదలచిన బ్రహ్మాండమైన రాజధాని అమరావతి  గురించి కూడా పునరాలోచించాలి. కారణం-
1. మానవ వికాసానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదని ప్రపంచ ర్యాంకింగ్ లో ముందు వరుసలోని నార్వే, స్విట్జర్లాండ్, డెన్మార్క్.. నిరూపిస్తున్నాయి. ఇదే దేశంలోని కేరళ వంటి రాష్ట్రాలూ నిరూపిస్తున్నాయి.
2. ఇతర ప్రాంతాల వెనుకబాటుతనమ్మీద ఒకే ప్రాంతంలో పోగుపడిన విద్య,ఉపాధి, వైద్య అవకాశాల కారణంగా రాష్ట్రవిభజనలో హైదరాబద్ద్ విషయంలో జరిగిన అనుభవం గుణపాఠం కావాలి. భవిష్యత్తులో తప్పక మరిన్ని విభజనలుంటాయి, ఇది చారిత్రక అనివార్యత కూడా. కాబట్టి పాలనా విభజన జరగాలి ప్రాంతాలవారీగా ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలమీదుగా. కనీసం పక్కనున్న కర్ణాటకలో లాగా రెండుప్రాంతాలలో అసెంబ్లీ సమావేశాలు జరగాలి.
  
3. రాజధాని అంటే నగరానికో, ఎవరికో పోటీకాదు, అదొక పాలన సౌలభ్యత గలిగిన ప్రదేశం. దూరం అనేది ఒక విషయంగా పరిగణింపబడని ఈ వేగవంతమైన రవాణా కాలంలో అందరూ వూరికి దూరంగా, అవసరమైతే వేగంగా వూర్లోకి రాగలుగుతున్నప్పుడు, అసలు పనులనేవి ప్రత్యక్షంగా కలుసుకోవడం ద్వారా గాక టెలికాన్ఫరెన్స్ , వీడియో కాలింగ్, E- గవర్నెన్స్ ద్వారా జరుగుతోన్నప్పుడు ఇక అధికార యంత్రాంగమంతా ఒకే చోట వుండి పాలించాలిన అవసరత లేదు, అదిలేనప్పుడు ప్రపంచస్థాయి రాజధానులు అవసరంలేదు.


4.పూర్వం పాలకులు బ్రహ్మాండమైన నగరాలు, విగ్రహాలు నిర్మించేవారు, వాటిని చూసిన ప్రజలు రాజుపట్లా గౌరవం, భయం కలిగివుండి, అప్పనంగా పన్నులు సమర్పించుకుని కుక్కిన పేనుల్లా బ్రతికేవాళ్లు. ఇప్పుడు కూడా పిరమిడ్ల నిర్మాణాలూ, ఇడ్లీ స్టాండ్ నిర్మాణాల అవసరంలేదు. నిర్మించాల్సింది నగరాలు కాదు, ప్రజల విద్య, వైద్య, ఉపాధులు. అవి పెరిగితే వాళ్లే నగరాల్ని విస్తరింపజేసుకుంటారు. 
5. వెనుకబడిన ప్రాంతాలకోసం ప్రత్యేకనిధుల్ని కేంద్రం ఏటా మంజూరు చేస్తోంది. వాటిని రాజధానుల నిర్మాణానికి కేటాయింపు జరగకుండా చూడాలి.  


6.వాస్తవంలో కొత్త రాష్ట్రంకోసం శివరామన్ కమిటీ అన్ని రకాల పరిస్తితులని మదింపుచేసి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పుడు, ఇవేవీకావని, కొన్ని సామాజిక, రాజకీయ, ఆర్థిక లెక్కల రీత్యా ఏర్పాటు చేసిన రాజధాని విషయంలో ఇప్పటికైనా, అంటే ఏ ఒక్క శాశ్విత భవనమూ నిర్మించనప్పుడు రాజధాని మార్పు ఆలోచించాలి. 
7. అమరావతి అనేపదం ఒకప్పటి ఈ ప్రాంత గొప్ప సంస్కృతీ వారసత్వాలకు ప్రతీక. అదిప్పుడు లేని గొప్పలతో, అసంబద్ధతలతో  భ్రమరావతి కారాదు.''




amaravati
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
Research- వర్షాధార సాగులో వంద కోట్లు సాధించే మార్గం ఇదిగో .?
శంషాబాద్‌లో అతిపెద్ద విమానం!!
Photo Feature - ఆ ఇద్దరి కోసం అద్భుతమైన జైలు!!
'' నాతో సెల్ఫీ దిగినందుకు ఆమె భర్త ఏం చేశాడంటే...?''
అమృత ఆహారం తో అద్భుత జీవితం...
పండంటి జీవితానికి 12 సూత్రాలు
సెక్రటేరియట్‌ని టచ్‌ చేస్తే, 300 కోట్లు మటాష్‌!!
ఎయిర్‌ పోర్ట్‌లో,  శ్రీవాణి కి ఒక రూల్‌, బాబుకి మరో రూలా..?
ఫొటో ఫీచర్‌ - అమిత్‌ షాను జగన్‌ ఏం అడిగారు..?
‘జిఎమ్‌ఆర్‌ ’లో, ఉచితంగా ఉపాధి శిక్షణ...
జగన్‌కి రైతన్న లేఖ !!
అక్కడ మూత్రానికి వెళ్తే జీతం కట్‌ ..?
యోగా తో సంకల్ప సిద్ధి!!
 మనసును ధ్యాన మార్గం వైపు మళ్లించడం ఎలా..?
సమస్త సవాళ్లను సమాధానం యోగనిద్ర !!
'' భూమి పుత్ర అవార్డులు ''
జీవితం అంటే?
'' వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పార్టీ ఫిరాయించారా ?''
బాబు,కేసీఆర్‌కి, పాఠం చెప్పిన జగన్‌...?
ఇక్కడ అడుగు పెడితే, గుండె జారి గల్లంతవుతుంది...!!
 మడతపెట్టే ల్యాప్‌టాప్‌లు !!
 Failure Story-  నీరు లేని ఊరు?
ఆదర్శం -  ఈ కలెక్టరమ్మకు జేజేలు!!
  జర్నలిస్టులకు జగన్‌ బంపర్‌ ఆఫర్‌ ...?
సచివాలయం లో జర్నలిస్టులకు ఉచిత భోజన సదుపాయం..?
 జగన్‌ గారిని కలవాలనుకుంటున్నారా..?
ఎక్కడి సినారె, ఎక్కడి యార్లగడ్డ...? ఏమిటీ సంబంధం..?
మానవ వికాసానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా ?
 '' ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే, న్యాయస్థానం చేతులు ముడుచుకు కూర్చోదు.. సీఎం గారు..? ''
'మల్లేశం' ఒక జీవన చిత్రం !!
"అమ్మ ఒడి"  టీచర్లకు గుండె, దడ...?
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ,ఉద్యోగం
మాయమైపోతున్నారు.? ఎందుకో తెలుసా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.