ఏపీలో జర్నలిస్టులకు ఇక పండుగే!!

దశాబ్దాలుగా సమస్యల వలయంలో విల విల లాడుతున్న జర్నలిస్టులకు, జగనన్న వరాలు ప్రకటించ బోతున్నారు. ఇటీవల ఐ అండ్‌ పిఆర్‌ మంత్రి తో ప్రత్యేక భేటీ లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది . త్వరలోనే హామీల అమలుకు కార్యాచరణ కూడా సిద్ధం అయింది. దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల కుటుంబాలకు మేలు చేయాలని జగన్‌ డిసైడ్‌ అయ్యారు. ఆయన తీసుకోబోయే నిర్ణయాలు అమలు అవుతే , అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని పాత్రికేయ సంఘాలు అంటున్నాయి. ఇవీ సంచలన నిర్ణయాలు.

1, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

 2, తెలంగాణ తరహాలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లని నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం

 3, ఏ పాఠశాలలో చదివించినా జర్నలిస్టుల పిల్లలకు ఫీజు ప్రభుత్వమే చెల్లించాలి అని నిర్ణయం 

4, స్కూల్‌ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 50 వేలు ... కాలేజ్‌ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 70 వేలు 

5, రాష్ట్రంలో జర్నలిస్టు కుటుంబాలకు బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం... 

6, వర్కింగ్‌ జర్నలిస్టులకు మండల స్థాయి జర్నలిస్టులకు 5 వేలు గౌరవ వేతనం నియోజకవర్గం, రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు 10 వేలు గౌరవ వేతనం 

7, పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు 15 వేల పెన్షన్‌ 

8, చిన్న పత్రికలకు జీవం పోసేలా భారీగా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలి అని నిర్ణయం 9, జర్నలిస్టులకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు నూతన పథకం 

10, రాజన్న జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీం ద్వారా, 20 లక్షల వరకూ వైద్య సహాయం ఉచితంగా అందించ బోతున్నారు. 

11, అక్రిడేషన్ల జారీ ప్రక్రియ సులభతరం చెయ్యాలి అని నిర్ణయం 

12, ఏపీ సచివాలయం లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్యాంటిన్‌ ఏర్పాటు ఉచిత భోజన సదుపాయం

మరింత సమాచారం తెలుసుకోండి: