తెలుగుదేశంపార్టీ నేతలు కమ్ బిజినెస్ మ్యాన్లకు మొదటి షాక్ ఎదురైంది. నారాయణకు చెందిన రెండు స్కూళ్ళను ప్రభుత్వం మూయించేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుండటమే మూసివేతకు ప్రధాన కారణం. బిజినెస్ మ్యాన్లుగా ఉంటూనే టిడిపి నేతలుగా చక్రం తిప్పిన అనేకమందిలో మాజీ మంత్రి పి. నారాయణ కూడా ఒకరు.

 

నారాయణ మొదట విద్యాసంస్ధల అధిపతి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే టిడిపిలో చేరి మంత్రయ్యారో అప్పటి నుండో ఆయన స్కూళ్ళ బిజినెస్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మంత్రి హోదాలో నారాయణ విద్యాసంస్ధలను అడ్డదిడ్డంగా విస్తరించేశారు. అనుమతులు లేకుండా కూడా స్కూళ్ళను నిర్వహించేశారు.

 

దానికి తోడు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎటూ వియ్యంకుడే కావటంతో ఇక నారాయణ  విద్యా వ్యాపారానికి అడ్డే లేకుండా పోయింది. విద్యాసంస్ధల్లోని సంపాదననే నారాయణ టిడిపి వ్యవహారాలకు పెట్టుబడిగా పెట్టారనే ప్రచారం కూడా బాగా జరుగుతోంది. ఇటువంటి సమయంలో నారాయణకు రాజధాని నిర్మాణ వ్యవహరాలను కూడా అప్పగించటంతో ఇక ఆయన హవాకు అడ్డే లేకుండా పోయింది.

 

ఈ నేపధ్యంలోనే మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సమీక్షల్లో టిడిపి హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి. ఇందులో భాగంగానే విజయవాడ సత్యనారాయణపురంలో అనుమతులు లేకుండానే నడుస్తున్న నారాయణ విద్యాసంస్ధ విషయం చర్చకు వచ్చింది. ఎటువంటి గుర్తింపు లేకుండానే నడుస్తున్న ఈ స్కూలుకు లక్ష రూపాయలు ఫైన్ వేసి అధికారులు మూయించేశారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: