కొత్త అసెంబ్లీ, కొత్త ప్రభుత్వం. ఓ వైపు వైసీపీ ఎమ్మెల్యేలలో హుషార్, ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఆనందంతో సందడి చేశారు. మొత్తం అసెంబ్లీ అంతా  వైసీపీ మయం. ఎందుకంటే 175 సీట్లలో 151 సీట్లు గెలుచుకుని వైసీపీ మొత్తం అసెంబ్లీలో 86 వాటా లాగేసింది. ఇక మిగిలిన 23 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ బిక్కుబిక్కుమంటూ దీనంగా అసెంబ్లీలో ఓ మూల కనిపించింది.


ఇదిలా ఉండగా జగన్ సభానాయకుడుగా హుందాగా, నవ్వుముఖంతో కనిపిస్తే ప్రతిపక్ష బెంచీలలో అవమాన భారంతో ఉన్నట్లుగా చంద్రబాబు అండ్ కో కనిపించారు. మొదట జగన్ ప్రమాణం చేయడం, తరువాత చంద్రబాబు రావడం నిజంగా తమ్ముళ్ళకు గుండెల్లో మంట పెట్టేవే. ఇక చంద్రబాబు పక్కన ఉప నాయకుని హోదాలో అచ్చెన్నాయుడు కూర్చుంటే వెనక వరసలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కనిపించారు. 


మంత్రిగా ఉన్నపుడు ఆయన మంచి హెయిర్ స్టైల్, చలువ కళ్ళద్దాలతో సినిమా హీరోలా హవా చాటేవారు. ఇపుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో ఆ మేకప్పులేవీ లేవు. పైగా తిరుపతి వెళ్ళివచ్చినట్లున్నారు గుండుతోనే సభలోకి రావడంతో ఎవరూ ఆయన్ని గంటా అని పోల్చుకోలేకపోయారు. ఉన్నవాళ్ళలో బాలక్రిష్ణ టీడీపీ నుంచి హుషార్ చేశారు. వైసీపీ పక్ష ఎమ్మెల్యేలను పలకరిస్తూ ఆయన  సభలో సందడిగా గడిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: