జిల్లా ఎస్పీ న‌యీం హ‌ష్మీ
జ‌ర్న‌లిస్టులు నేర ప‌ర‌మైన వార్త‌ల సేక‌ర‌ణ‌, ప్ర‌చుర‌ణ‌లో పోలీసు అధికార్ల తో స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని తూర్పుగోదావ‌రి జిల్లా ఎస్పీన‌యీం హ‌ష్మీ కోరారు. తూర్పుగోదావ‌రి జిల్లా ఎస్పీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన న‌యాం హ‌ష్మీని ఆంధ్ర్రప్ర‌దేశ్ జ‌ర్న‌లిస్ట్స్ సంఘాల ప్ర‌తినిధి బృంధం క‌లిసి విజ్ఞ‌ప‌న ప‌త్రాన్ని అంద‌చేసారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ హ‌ష్మీ మాట్లాడుతూ విధి నిర్వ‌హ‌ణ‌లో రియ‌ల్ జ‌ర్న‌లిస్టుల‌కు పోలీసు శాఖ అన్ని విధాలా స‌హ‌కారాన్ని అందిస్తుంద‌ని హామీ ఇచ్చారు.

విధి నిర్వహణలో సంఘ వ్యతిరేక శక్తుల నుండి జర్నలిస్టులు అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంద‌ని, అటువంటి తరుణంలో పోలీసు శాఖ ఒక రక్షణ కవచంలా, జర్నలిస్టులను కాపాడ వలసినదిగా జర్నలిస్టులు  కోరారు. జర్నలిస్టులపై కొంత మంది అరాచక శక్తులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పోలీసు కేసులు పెట్టడం జరుగుతోంద‌ని, అటువంటి సంద‌ర్భాల‌లో కేసు నమోదు చేసే ముందు వివిధ పాత్రికేయ సంఘాల ముఖ్యులు, పోలీసు అధికార్లతో నిజనిర్ధారణ కమిటీ వేసి కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట తగిన చర్యలు తీసుకునేలా పోలీసు అధికార్లకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞ‌ప్తి చేసారు. నేర ప‌రిశోధ‌న వార్త‌ల సేక‌ర‌ణ‌లో పోలీసు శాఖ, జర్నలిస్టులతో సమన్వయంతో వ్యవహరించి జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించాల‌ని  ఆకాంక్షించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: