అనే నేను..  అంటూ ప్రమాణ స్వీకారం చేయాలని  ఉబలాట పడని  రాజకీయనాయకుడు ఉండడు.  అధ్యక్షా అంటూ  అసెంబ్లీలో మాట్లాడాలని ఎందరో  కలలు కంటారు.  కొందరే ఆ కలను సాకారం చేసుకుంటారు.

 

అయితే ప్రమాణ స్వీకారం చేసేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి.  కొందరు  దైవ సాక్షిగా  ప్రమాణ స్వీకారం చేస్తారు.  ఇంకొందరు ఆత్మ  సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.  ఈ రెండింటిలో ఎలాగైనా ప్రమాణ స్వీకారం చేయొచ్చు.

 

కానీ ఇలా కాకుండా మరి కొందరు డిఫరెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తుంటారు.    తాజాగా వైసీపీ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సాక్షిగా అంటూ ప్రమాణ స్వీకారం చేశారు.  తమ నాయకుడు  పై  ఆయనకున్న అభిమానం  అలాంటిది కావచ్చు.

 

కానీ రూల్స్ అందుకు   ఒప్పుకోవు కదా.  అందుకే  ప్రొటెం స్పీకర్  ఆ ప్రమాణ స్వీకారం అంగీకరించలేదు.  సభ్యుల ప్రమాణ స్వీకారా లన్ని  పూర్తయ్యాక  కోటంరెడ్డి తో  మరోసారి  ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ  ఎమ్మెల్యే  గతంలోను ఇలాగే చేశారట.  మొత్తం మీద జగన్  పై అభిమానం అలా  చాటుకున్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: