ముఖ్యమంత్రి కాక ముందు జగన్ ఢిల్లీ ఒకమారు వెళ్ళారు. ఎన్నికల ఫలితాలలో  వైసీపీకి భారీ ఆధిక్యత వచ్చిన  డిల్లీకి వెళ్ళిన జగన్ ఈ సందర్భంగా అయన ప్రధాని మోడీని కలిసి తొలి విన్నపం అందించారు. ప్రత్యేక హోదాపై తన మనసులో మాట చెప్పి తప్పకుండా ఇవ్వాలని ప్రధానిని కోరారు. ఇక తిరుపతి స్వామివారి దర్శనానికి ప్రధాని వచ్చినపుడు కూడా జగన్ వచ్చి హోదా అంశాన్ని ప్రస్తావించారు.


ఇవన్నీ ఇలా ఉంటే జగన్ ఈ నెల 14న ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన 15న డిల్లీలో తమ పార్టీ ఎంపీలకు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేస్తారు. అదే విధంగా ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్లో అనుసరించాల్సిన తీరుపైన కూడా చర్చిస్తారు. ఆ అంశం అతి ముఖ్యమైనది అని జగన్ చెప్పబోతున్నారు. ఇక విభజన హామీలు, ఏపీ ఆర్ధికంగా లోటుతో  ఉన్న సంగతి ఇవ‌న్నీ పార్లమెంట్లో చెప్పడం ద్వారా ఎంపీలు ఏపీకి న్యాయం  కోరుతూ  గట్టిగా క్రుషి చేయాలని కోరనున్నారు.


ఇదిలా ఉండగా ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి ఏపీకి కేంద్రం ఏమి ఇస్తుందో కూడా చూస్తారు. ఎక్కువ నిధులు రాబట్టేలా ఎంపీలు క్రుషి చేయాలన్నది జగన్ ఆలోచన. ఆ విధంగా ఆయన వైసీపీ ఎంపీల భేటీలో వివరిస్తారని తెలుస్తోంది. మొత్తానికి జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా  ఉంటుందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: