వైకాపా విజయం సాధించిన తరువాత రోజాకు తప్పకుండా పదవి వస్తుంది అనే ఊహాగానాలు వచ్చాయి.  ఊహాగానాలు రావడమే కాదు.. ఆమెకు మంత్రి పదవి ఖాయం అయిందని వార్తలు వచ్చాయి.  మొదట స్పీకర్ పదవి.. లేదంటే హోమ్ మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు.  మీడియాలో కూడా ఈ విధంగా వార్తలు వచ్చాయి.  

కానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.  మంత్రివర్గం పేర్లలో రోజా పేరు లేకపోవడంతో ఆమె అలిగి హైదరాబాద్ వెళ్లిందని వార్తలు వచ్చాయి.  ఆమె చుట్టూ వస్తున్న వార్తలతో జగన్ లో ఒత్తిడి పెరిగింది.  ఆమెకు పదవి ఇవ్వాలని లేదంటే తప్పుడు ప్రచారం జరుగుతుందని వార్తలు రావడంతో.. విజయసాయి రెడ్డి రోజాకు ఫోన్ చేసి పిలిపించారట.  

రోజా జగన్ తో మీట్ అయ్యింది.  అయితే తనకు ఎలాంటి పదవి అవసరం లేదని జగన్ తో చెప్పింది.  అయినప్పటికి జగన్ పై వస్తున్న ఒత్తిడి మేరకు ఆమెకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని ఇస్తున్నట్టు సమాచారం.  దీనిపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.  

ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో రోజా అమరావతి వచ్చారు.  ఈ సందర్భంగా జగన్ ను మీట్ అయ్యినట్టు తెలుస్తోంది.  రోజా పదవితో పాటు మిగతా విషయాలపై కూడా క్లారిటీ రావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: