తెలుగుదేశం పార్టీకి, వైకాపాకు చాలా సారూప్యత ఉంది.  2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది.  ఈ పొత్తులో భాగంగా టీడీపీకి రెండు కేంద్రమంత్రి పదవులు దక్కాయి.  అయితే, ఎన్నికలకు సంవత్సరం ముందు ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో మంత్రి పదవులు వదులుకోవాల్సి వచ్చింది. 

2019 ఎన్నికల్లో ఎలాగైనా తేలుస్తామని తెలుగుదేశం పార్టీ అనుకుంది. అనుకున్నదే గాని, రియాలిటీ విషయానికి వచ్చే సరికి రివర్స్ అయ్యింది.  అనుకున్నట్టుగా పార్టీ విజయం సాధించలేదు.  దీంతో మొదటికే మోసం వచ్చింది.  2019 ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది.  

ఆంధ్రప్రదేశ్ లో వైకాపా అధికారంలోకి వచ్చింది.  వైకాపా అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి కేంద్రం నుంచి ఓ అఫర్ ను ప్రకటించింది.  స్పీకర్ పదవి బీజేపీ అభ్యర్ధికి ఇస్తూనే.. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వడం ఆనాయితిగా వస్తున్నది.  లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైకాపాకు డిప్యూటీ స్పీకర్ అఫర్ చేసింది.  

దీనిపై వైకాపా ఇప్పటి వరకు స్పందించలేదు.  వైకాపాకు డిప్యూటీ స్పీకర్ పదవి అంటే గ్రేట్ అని చెప్పాలి.  పైగా ఈ పదవి తీసుకుంటే ప్రభుత్వంతో ఏవైనా పనులు ఉన్నా చేయించుకోవచ్చు.  అయితే, ఈ పదవిని తీసుకుంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టినట్టుగా ప్రజలు భావిస్తారేమో అనే ఆలోచనలో పడింది వైకాపా.


మరింత సమాచారం తెలుసుకోండి: