వైసీపీ ఫెయిర్ బ్రాండ్ ఆర్కే రోజా ఎపుడూ సంచలనమే. ఆమె సినిమాల్లో ఉన్నపుడు, టీడీపీలో రాజకీయం చేసినపుడు, ఇపుడు వైసీపీలో పదేళ్ళ పోరాటంలో కూడా ఆమె తనదైన మార్క్ చూపిస్తూ జనంలో ఇమేజ్ సంపాదించుకున్నారు.


రోజా అనగానే రెడ్డి అని అందరికీ తెలిసిందే. ఆమె కుటుంబం గురించి తెలిసిన వారికి ఇదేమీ పెద్ద విషయం, కొత్త విషయం కానే కాదు. అయితే రోజా మాత్రం తాను రెడ్డిని కాదంటున్నారు. అవును ఇది నిజమే రోజా తాను పుట్టి పెరిగింది రెడ్డి కులంలో అయినా తాను బీసీని పెళ్ళి చేసుకున్నానని, తమిళ్ దర్శకుడు సెల్వమణి బీసీ అని, అందువల్ల తాను కూడా బీసీనేనని కొత్త లాజిక్ బయటకు తీసారు.


అసలు ఇంతకీ ఈ కులం రచ్చ ఎందుకంటే రోజాకు మంత్రి పదవి రాకపోవడానికి ఆమె రెడ్డి కార్డ్ మైనస్ అయింది. దీని మీద మీడియాతో మాట్లాడుతూ రోజా వివరణ ఇచ్చే ప్రయత్నంలో  తన భర్త కులమే తన కులమని, తాను బీసీనని చెప్పుకున్నారు. మరి ఇది రాజకీయంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: