జగన్ ముక్కుసూటి మనిషి. ఆయన రాజకీయం కూడా అలాగే ఉంటుంది. నమ్మితే ముందుకు అలా సాగిపోతారు. అందులో రాజకీయ ప్రయోజనాలు లాభ నష్టాలు బేరీజు వేసుకోరు. మరీ ఇంత మంచితనం, నిజాయతీ రాజకీయాల్లో సరిపోతుందా అన్నదే ఇక్కడ ప్రశ్న.


విషయమేంటంటే జగన్ మంచితనం, చిన్నతనం ఆసరాగా చేసుకుని లబ్ది పొందేందుకు చాలా మంది అపుడే తయారుగా ఉన్నారు. భట్రాజ్ పొగడ్తలతో జగన్ని ఉబ్బేసే బ్యాచ్ కూడా తయారైంది. ఇవన్నీ ఇలా ఉంచితే జగన్ ఇపుడు ఏపీ ముఖ్యమంత్రి. అయిదు కోట్ల మందికి ప్రతినిధి. ఆయన ప్రతి అడుగు చర్య ద్వారా కోట్ల మంది ప్రజల లాభనష్టాలు ముడిపడిఉన్నాయి. వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది.


తెలంగాణాతో అసలు స్నెహం వద్దు అని చంద్రబాబు అనుకున్నారు. అది నష్టమే. జగన్ తెలంగాణాతో స్నెహమే ప్రాణం అంటున్నారు ఇదీ కూడా ఆలోచించాల్సిందే. ఎందుకంటే కేసీయార్ తెలివైన రాజకీయ నేత. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తమ రాష్ట్ర ప్రయోజనాలు ఫణంగా పెట్టేందుకు ఒప్పుకోడు. దేశం మొత్తం ఏకమై ఓ దశలో వద్దన్న తెలంగాణాను మొండితనంగా సాధించిన యోధుడు. 


ఇక కేసీయార్ మిత్రత్వంతో ఇప్పటికైతే ఏపీకి వచ్చింది ఏదీ  లేదు. జగన్ ఇలా సీఎం కాగానే అలా ఏపీ భవనాలు తెలంగాణాకు అప్పగించేశారు. ఆ విషయంలో కేసీయార్ తొలి విజయం సాధించారు. ఇపుడు కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ ప్రారంభానికి జగన్ని ముందు పెట్టి శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ మీద ఏపీ కి చాలా అభ్యంతరాలు  ఉన్నాయి. గోదావరి నీరు ఒడిసిపట్టి ఎగువ రాష్ట్రాలు లాగేసుకుంటే దిగువ, చివరి రాష్ట్రం ఏపీయే నష్టపోతోంది.


మరి ఈ విషయాలు గమనంలోకి తీసుకోకుండా తెలంగాణా సర్కార్ నిర్మించిందని ఏపీ నీటి పారుదల రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ దశలో జగన్ కోరి పిలిచారని వెళ్తే రాజకీయంగా భారీగా నష్టం ఉంటుంది. అంతే కాదు. ఏపీతో తెలంగాణా చాలా సమస్యలు ముడి పడి ఉన్నాయి వాటి మీద జగన్ గట్టిగా పోరాడి కేసీయార్  నుంచి సాధించుకుని  రావాలి. అంతే తప్ప పెద్దాయన అని మర్యాదకు, మొహమాటానికి పోతే ఏపీ ప్రయోజనాలు గరిష్టంగా దెబ్బతింటాయి, మరి జగన్ ఆచీ తూచీ అడుగులు వేయడం మంచిదని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: