ఆటలో గెలుపోటములు సహజం.. ఎన్నికలు అన్నాక ఒకరు ఓడిపోతారు మరొకరు గెలుస్తారు.  ఇది మామూలే.  అయితే, ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ ఓటమిపాలైంది.  ఇలా పార్టీ ఓడిపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది.  పార్టీ ఓడిపోయింది కాబట్టి అందరికి లోకువే.  


బయటి వాళ్లకు అనుకుంటే సరే.. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలే సాక్షాత్తు అధినేత చెప్పిన విషయాలను ఖాతరు చేయకుండా.. పెడచెవిన పట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎలా చెప్పండి.  వీటిని కొంతమంది టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదు.  


సరే వాళ్ళు మొదటిసారి గెలిచిన వ్యక్తుల్లో లేదంటే మరొకరో అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే, వీళ్ళు పార్టీలో సీనియర్ నేతలు రేపోమాపో పార్టీలో కీలక పదవులు అందుకోబోతున్న వ్యక్తులు.  అలాంటి ఈ వ్యక్తులు అధినేత చెప్పిన మాటలు వినకుండా ఉంటె ఎలా.  


ఇంతకీ ఆ ఇద్దరు సీనియర్ లీడరు ఎవరనే ప్రశ్న ఉదయించింది కదా. వాళ్ళు ఎవరో కాదు.. కరణం బలరాం రెండో వ్యక్తి పయ్యావుల కేశవ్.  ఈ ఇద్దరు పార్టీ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి.. నేతలు దృష్టిని ఆకర్షించడం మొదలు పెట్టారు.  ఇది టిడిపి రుచించలేదు.  కానీ, ఇప్పుడు ఏమి అనలేని పరిస్థితి మరి బాబు ఎం చేస్తాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: