తెలంగాణా కల  సాకారం అయ్యింది.  తెలంగాణాను సస్యశ్యామలం చేసేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు దాదాపుగా పూర్తయ్యాయి.  ఈనెల 21 ఆ తేదీన ఈ ప్రాజెక్ట్ ఓపెన్ కాబోతున్నది.  ఈ ప్రారంభోత్సవ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీని ఆహ్యానించబోతున్నారు.  మోడీతో పాటు పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులైన జగన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నారు. 


2016 మే 2న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అంతరరాష్ట్ర సమస్యలు, భూసేకరణ పునరావాస సమస్యలు, అనుమతులు, కోర్టు కేసులు.. ఇలా అన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ రావడమే కాకుండా వర్షాకాలం పోనూ రెండేళ్లలోనే అత్యధిక భాగం పనులను పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసింది. 


నిధుల సమస్య రాకుండా బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంది. ఇంజినీర్లు, గుత్తేదారులతో నిరంతరం ముఖ్యమంత్రే స్వయంగా సమీక్షించి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవడం ద్వారా లక్ష్యానికి తగ్గట్లుగానే తక్కువ సమయంలో పనులు పూర్తి చేయించగలిగారు. 


మూడేళ్లలోనే సుమారు రూ. 50,000 కోట్లు ఈ ఒక్క ప్రాజెక్టుపైనే ప్రభుత్వం ఖర్చుపెట్టిందంటే సర్కారు దీనిపై ఎంత పట్టుదలతో ఉందో అర్థమవుతుంది..ఈ ప్రాజెక్ట్ ద్వారా 18.25 లక్షల ఎకరాలకు నీటిని అందించవచ్చు.  141 టిఎంసిల నిల్వసామర్ధం కలిగియున్న ఈ ప్రాజెక్ట్ లో 30 వేలమంది కార్మికులు పనిచేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: