వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా పాగా వెయ్యాలని బీజేపీ పావులు కదుపుతోంది.  తెలుగు రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన బీజేపీ, అక్కడి నేతలకు గాలం వేసేందుకు రెడీ అవుతున్నది.  మొదట తెలంగాణాపై పార్టీ దృష్టి సారించింది. 

మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంతో.. ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది.  ఈ ఆత్మవిశ్వాసంతోనే ముందుకు అడుగువేయబోతున్నది.   కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా వరకు బలహీనపడింది.  ఆ పార్టీకి చెందిన 12 ఎమ్మెల్యేలు తెరాస లో జాయిన్ అయ్యారు.  దీంతో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ హోదాను కోల్పోయింది. 


ఇక్కడ కాంగ్రెస్ కు ముగ్గురు ఎంపీలు ఉన్నాయి.  ఈ ముగ్గురిలో ఇద్దరు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో మాట్లాడరు.  దీనిగురించి మాట్లాడారు అనే విషయాలు తెలియదుగాని,  మొత్తానికైనా చర్చలు జరిపారు.  అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఇద్దరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.  


వీరితో పాటు మాజీ ఎంపీ వివేక్ కూడా పార్టీ మారబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఇందులో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాలి. ఒకవేళ ఇద్దరు ఎంపీలు పార్టీ మారితే.. బీజేపీ బలం నాలుగు నుంచి 6 కు పెరుగుతుంది.  అంటే దాదాపుగా తెరాస తో పోటీ పడుతుందన్నమాట.  


మరింత సమాచారం తెలుసుకోండి: