గత ప్రభుత్వం టీడీపీ పచ్చ మీడియాకు ప్రభుత్వానికి సంభందించిన కీలక నిర్ణయాలను ముందుగానే లీక్ చేసేది. గత అయిదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వంలోని లొసుగులు అన్నీ వెలికి తీసింది సాక్షి మాత్రమే. సాక్షి లేకపోయివుంటే చంద్రబాబు ప్రభుత్వంలోని లోగుట్టు వ్యవహారాలు బయటకు తెలిసేవి కావు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నెగిటివ్ వార్తలు రాయకపోవడం అన్నది కామన్. ఎందుకుంటే సాక్షిపత్రిక ఆ పార్టీదే కాబట్టి.


కానీ పార్టీలోని కీలక విషయాల లీకులు కూడా సాక్షిలో రావడంలేదు. మంత్రి పదవులు కానీ, ఇతరత్రా పదవుల వార్తలు అన్నీ ముందుగా సాక్షికి తెలియచేసి, లీక్ చేసే అవకాశం వుంది. ఆంధ్రజ్యోతిలో అలాగే లీక్ అయ్యేవి. మర్నాడు నిజాలయ్యేవి. కానీ జగన్ పొరపాటున కూడా లీక్ అన్నదాన్ని అంగీకరిస్తున్నట్లు లేదు. పైగా వేరే పత్రికల్లో లీక్ అయినా కూడా సాక్షి వాటిని పట్టించుకోవడం లేదు.


ఎమ్మెల్యే రోజాకు ఎపిఐఐసి చైర్మన్ పదవి ఇస్తున్నారని ఈ ఉదయమే వెబ్ సైట్లలో, ఆ తరువాత ప్రింట్ మీడియా వెబ్ సైట్లలో వార్తలు గుప్పుమన్నాయి. కానీ సాక్షి మాత్రం ఆ వార్తను పట్టించుకున్నట్లు కనిపించలేదు. రోజా ఫేస్ బుక్ అప్ డేట్ ను కూడా సాక్షి వదిలేసింది. ఈ లెక్కన చూస్తుంటే ఇక మరో అయిదేళ్ల పాటు సాక్షి పొలిటికల్ గ్యాసిప్ లకు, నెగిటివ్ వార్తలకు దూరమై, జస్ట్ పాజిటివ్ రిపోర్టింగ్ కు పరిమితం అయిపోయేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: