ఆంధ్రుల రాజధాని అమరావతి అనే పేరుతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనులు ప్రారంభించారు.  ప్రపంచంలో టాప్ నగరాల్లో ఒకటిగా తీర్చి దిద్దడానికి అమరావతిని తీసుకొచ్చారు.  కానీ, మొన్న జరిగిన ఎన్నికల్లో బాబు ఓడిపోవడంతో అమరావతి నిర్మాణం ప్రశ్నర్ధకంగా మారింది. 


ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుపడే వరకు రాజధాని పనులు కొన్నిటిని ఆపేయాలని సూచించాడు ఇప్పటికే జగన్ సూచించారు. సీఆర్‌డీఎస్ పూర్తి సమంక్ష జరిపిన తరువాత నుర్ణయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. అందుకే శాశ్వత హైకోర్ట్, అసెంబ్లీ సచివాలయ పనులను కొద్ది రోజులు నిలిపివేయాలనే యోచనలో ఉందట. 


అయితే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ  చెందిన వ్యక్తులు, సీఎం జగన్ అనుమతులిస్తే పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నామని అంటున్నారు.  కానీ, జగన్ మాత్రం ఈ దిశగా ఆలోచించడం లేదని చెప్పాలి.  అమరావతిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడ కు షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.  


విజయవాడలో ఉంటె, అందరికి అనుకూలంగా ఉంటుంది.  రాకపోకలకు ఇబ్బంది ఉండదు అని జగన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.  మరి అమరావతిలో నిర్మించిన ప్రభుత్వ భవనాల పరిస్థితి ఏంటి.. అవి ఆలా ఉండిపోవాల్సిందేనా ... అలా చేస్తే ప్రభుత్వ ధనం వృధా అయినట్టే కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: