ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమల రాక మొదలైంది. అల్ట్రా టెక్ సిమెంట్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2500 కోట్లతో ప్రాజెక్ట్ మొదలుపెట్టబోతుంది. ప్రాజెక్ట్లో భాగంగా కర్నూల్ జిల్లా పెట్నికోటె గ్రామంలో సిమెంట్ ప్లాంట్ ను ప్రారంభించబోతుంది.

 

సిమెంట్ ప్లాంట్ కోసం అల్ట్రా టెక్ కంపెనీ సుమారుగా 430 హెక్టార్ల భూమిని వినియోగించబోతుంది. ప్లాంట్లో 900 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అల్ట్రా టెక్ కంపెనీ అదిత్యా బిర్లా గ్రూపుకు సంబధించినది.ప్లాంట్ ద్వారా సంవత్సర కాలంలో 6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయవచ్చు.

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి మనకు ఎన్నో పరిశ్రమలు అవసరం .పరిశ్రమల ద్వారా ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. మన రాష్ట్రానికి మరెన్నో కంపెనీలు వస్తే యువతకు కూడా ఉపాధి అందే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: