ఒక స్కూలుకు, కాలేజీకి గుర్తింపు తీసుకుపోవటం గుర్తింపుతో మిగతా స్కూళ్ళు, కాలేజీలు నడిపించటం ఇలా ఉంది ప్రస్తుతం కార్పొరేట్ స్కూల్స్ పరిస్థితి.విజయవాడ సత్యనారయణ పురంలోని నారాయణ స్కూల్ ను విద్యా శాఖ అధికారులు మూసివేసారు.


పాఠశాలకు గుర్తింపు లేదనే కారణం చూపుతూ పాఠశాలను మూసివేసారు విద్యా శాఖ అధికారులు. స్కూల్ తెరిచిన మొదటి రోజే ఇలా జరగడం ఇక్కడ గమనార్హం. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు అందించిన నారాయణ యాజమాన్యం పట్టించుకోలేదు. అందువల్లే ఇలా చేయాల్సి వచ్చిందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నరు తప్పుకు లక్ష రుపాయల జరిమానా విధించారు

 

రాష్ట్రంలో ఎన్నో పాఠశాలలు అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇలాంటి పాఠశాలలపై సీఎం జగన్మోహన్ రెడ్డిగారు తీసుకుంటున్న నిర్ణయంతో రాష్ట్రంలోని గుర్తింపు లేని పాఠశాలలు ఇప్పటినుండైనా అనుమతులు పొంది నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నడిపే అవకాశం ఉంది


మరింత సమాచారం తెలుసుకోండి: