జగన్ అంటేనే నమ్మకం. ఆయన తండ్రి కాలం నుంచి కూడా మాట మీద నిలబడే తత్వం ఉన్న వంశం. ఒకసారి చెప్పారంటే  వెనక్కి తిరగని నైజం జగన్ ది. అటువంటి నేత ప్రభుత్వాధినేత అయ్యాక ఆయన కొంతమందికి ఇచ్చిన మాటను తప్పారన్న విమర్శలు వచ్చాయి.


మరి జగన్ అలా చేస్తారా. తనను నమ్మి పదేళ్ళ పాటు పోరాటం చేసినవారు, వెంట నడచిన వారిని అలా వదిలేస్తారా. అసలు వదిలేయరు. వదిలేస్తే  ఆయన జగన్ కారు. అందుకే జగన్ తన వారి కోసం పదవుల పందేరానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో ఉన్న నామినేటెడ్ పోస్ట్లు ఎమ్మెల్యేలకే ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇవి కాకుండా కొత్త పదవులు కూడా స్రుష్టించి భారీ ఎత్తున పంపిణీ చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది.


ఇందుకోసం ఆయన ప్రాంతీయ అభివ్రుధ్ధి మండళ్లను తెర మీదకు తెస్తున్నారు. దీని వల్ల వీలైనంతమందిని నియమించవచ్చునని భావిస్తున్నారు. క్యాబినెట్ ర్యాంక్ హోదాను వీటిని కల్పించి అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుడతారని అంటున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్త్తా, రాయలసీమ ఇలా నాలుగు ప్రాంతాలకు నాలుగు ప్రాంతీయ  బోర్డులను ఏర్పాటు చేసి చైర్మన్లుగా  తన వారిని నియమించాలనుకుంటున్నారు.


కేంద్రం వెనకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేస్తుంది. దానికి ఏపీ కూడా నిధులు కలిపి ఎక్కడికక్కడ అభివ్రుధ్ధి చేయాలన్నది జగన్ ఆలోచన‌గా ఉంది. మొత్తానికి జగన్ నమ్మిన వారు సైతం షాక్ తినేలా పదవులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: