Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 11:29 pm IST

Menu &Sections

Search

నాలుగు దశాబ్ధాల అనుభవం-మళ్లి మొదలెట్టిన శ్రీచంద్ర నీతులు

నాలుగు దశాబ్ధాల అనుభవం-మళ్లి మొదలెట్టిన  శ్రీచంద్ర నీతులు
నాలుగు దశాబ్ధాల అనుభవం-మళ్లి మొదలెట్టిన శ్రీచంద్ర నీతులు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఐదేళ్ళు అధికారం చేతిలో ఉంచుకొని రాష్ట్రాభివృద్దికి కావలసినంత విఘాతాలు కలిగించిన టిడిపి అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఋణాల ఊబి లోని నెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు ఏమైనా చేయకపోరు, అనుభవంతో ప్రజలకు ఏదో మేలు చేస్తారని ఐదేళ్ళూ నిరీక్షించారు.

tokapatrika-srichandra-neetulu

*ఈ ఐదేళ్ళలో  ఉమ్మడి రాజధాని సదుపాయాన్ని ఓటుకు నోటు కేసులో చిక్కుకొని ప్రజా ప్రయోజనాన్ని తుంగలో తొక్కేశారు.

*అమరావతి, విశ్వనగర నిర్మాణం అంటూ టిడిపి మందీ మార్బలంతో ప్రత్యేక విమానాల్లో ఇరవై వరకు ప్రపంచ దేశాలు చూట్టేశారు.

*ఏవేవో పేర్లతో పలు కార్యక్రమాలు నిర్వహించి ఒకే కార్యక్రమానికి పదుల సంఖ్యలో శంఖుస్థాపనలు, శిలాఫలకాలు వేయిస్తూ ప్రజాధనం మురుగునీరు వదిలేసినంత తేలిగ్గా  దుబారా చేశారు.

*ముఖ్యమంత్రి కాంప్-కార్యాలయాలు నివాసభవనాల పేరుతో అటు హైదరాబాద్లో ఇటు అమరావతిలో కోటాను కోట్ల రూపాయ లు స్వప్రయోజనాలకు వాడేశారు


*శాసనసభ నుండి ప్రధాన ప్రతిపక్ష శాసనసభ్యుల్ని నయాన్నో భయాన్నో భయపెట్టో బామాలో కొనేసి – వేల కోట్ల అవినీతికి మార్గం సుగమమం చేశారు.


*ప్రజలెన్నుకున్న ప్రతిపక్షాన్ని “మంద బలం” తో శాసనసభ నుండి  ప్రజల్లోకి పంపారు. అక్కడ అది బలమైన చలిచీమల దండులా మారి “అంకొండను” అంటే టిడిపిని సమూలంగా చంపేసింది.


*రాష్ట్రంలో ఇసుక, కాల్-మనీ, కల్తీ, విద్య, ఆరోగ్య, రవాణా, గుత్తేదార్ల మొదలైన ఇంకా ఎన్నో అవినీతి కార్యక్రమాలలో  అనుయాయుల మాఫియాలను జొప్పించి ముఖ్యంగా చింతమనేని వంటి వారి సామాజికవర్గ జనాన్ని ప్రవేశింపజేసి – ఇతరుల ను ఎందుకూ పనికిరాని వాళ్ళను చేసి ఆర్ధికంగా రాష్ట్రప్రజల నడ్ది విరగ్గొట్టారు. .


*ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అన్నధాత సుఖీభవ అంటూ ప్రజాధనాన్ని ముఖ్యంగా “పన్నుకట్టే వాళ్ళ సొమ్ము” ఎవడబ్బగాడి సొమ్ములాగానో పంచేసి – ఎంతో కొంత రాష్ట్రాభివృద్ధికి సహకరించవలసిన కేంద్రాన్ని అనుక్షణం విమర్శిస్తూ – ఇచ్చిన వివిధ పథకాలకు అందజేసిన సొమ్ముకు బాధ్యవహించకుండా లెక్కలు చెప్ప కుండా వినియోగ ధృవపత్రాలు కేంద్రానికి సమర్చించకుండా – ప్రధానికి రాష్ట్రప్రజలకు మధ్య తంపులుపెట్టిన టిడిపికి ఇకరాష్ట్రంలో పుట్టగతులు ఉండవని స్పష్టంగా  తేలిపోయింది.

tokapatrika-srichandra-neetulu

*చంద్రబాబు అనుయాయులు సుజనా చౌదరి, సీఎం రమేష్, నారాయణ, దేవినేని ఇలా చెప్పుకుపోతే స్థలం సరిపొనంత మంది తెలుగుదేశంవాళ్ల కోసం  ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గం లోని కొందరి ప్రయోజనాల - దేశ సార్వభౌమత్వం పరిరక్షించే కేంద్రనిఘా సంస్థలకు ప్రవేశనిషేధం చేసిన టిడిపి “అంతరంగం” అందరికీ అర్ధమై 2019 ఎన్నికల్లో ఎడంకాలి తో బంగాళా ఖాతంలో పడేలాగా  తన్నేశారు.


*ఐదేళ్లలో టిడిపి ఆడిన నాటకాలు, దేశ వ్యాప్త ప్రతిపక్షాలతో డిల్లీలో వేసిన డ్రామాలకు అవన్నీ అతీగతి లేకుండాపోయాయి. తన రాజకీయ ప్రయోజనాలకు గరుడ శివాజి, సాధినేని యామిని, సినీనటి దివ్యవాణి, చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు చంద్రబాబు కుటిల నీతికి నిలువునా బలికాగా , ఆయనకు తోడుగా నిలిచి సొమ్ముచేసుకున్న సామాజికవర్గం వారెందరో బలిసిపోయారు 


ఇలా వివరించవలసి వస్తే ఈ వ్యాసం బహు సంపుటాల ఉద్గ్రంధమే ఔతుంది. ఇప్పుడు చావుతప్పి కన్నులొట్తపోయి కనీస ప్రతిపక్ష హోదా దక్కించుకొని అతి చిన్న పార్టీగా శాసనసభలో ఏం సాధిస్తారు.


“దేశం బాగుపడాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మనందరి లక్ష్యం అదే కావాలి. ఒక లక్ష్యంకోసం ఒళ్లుదాచుకోకుండా పనిచేశాం. పనే దైవంగా భావించి కష్ట పడ్డాం. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసమే టీడీపీ కట్టుబడి ఉంది” అన్న మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం తనను కలవటానికి ఉండవల్లికి భారీగా తరలి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ముస్లీం మహిళలు, విద్యార్థులు, సాధారణ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.


ఆ మాటలకు జనమేమీ పడిపోరు. జనం ఎందుకు ఎడంకాలితో తన్నేశారనే దానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ సీగ్గుమాలి “కప్పిపుచ్చుకోవటానికి” కాలం చెల్లింది. “దేనినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ మాత్రం అధైర్యపడ కూడదు. విద్యార్థులు బాగా చదువుకుని రాష్ట్రానికి మంచి పేరుతేవాలి” అని ఆయన చెప్పిన మాటలు ఎబ్బెట్తుగా వినిపిస్తున్నాయి అదీ కర్ణపేయంగా. విద్యను నారాయణ ఛైతన్య లాంటి ప్రయివేట్ సంస్థలకు వదిలేసి వాళ్ళని కుబేరుల్ని ప్రజలను బిచ్చగాళ్ళని చేసిన టిడిపి నాయకత్వం ఇంకా నిశ్శిగ్గుగా మాట్లాడటం అసంధర్భం.


‘‘నాయకులు పార్టీకి దూరం కావచ్చు. కానీ, కార్యకర్తలను మీకు, పార్టీకి దూరం చేయడం ఎవరి తరమూకాదు. పార్టీ ఓడిపోయిందంటే నమ్మలేకపోతున్నాం” అని ఎవరో అన్నారని సొంతంగానే సానుభూతి వ్యాఖ్యలు రాసుకోవటం ఒక తోక పత్రిక అలవాటు – అలా అన్నవాళ్ళ పేర్లు రాస్తే వారే సిగ్గుపడేలా జనం నిందిచటం తధ్యం.   


రైతు రుణమాఫీ 4, 5 విడతల సొమ్ము నిలిపివేస్తారన్న ప్రచారంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటిని ఇచ్చేలా చూడాలని, లేకపోతే తాము నష్టపోతామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లూ టిడిపి చేసిన వాగ్దానాలు బొక్కేసిన ప్రణాళికా వ్యయం భాధ్యత ప్రస్తుత ప్రభుత్వం తీసుకోవాలన్ టే – టిడిపి నాయకులు, ప్రజా ప్రతినిధులు, జన్మభూమి తదితర కార్యకర్తలు గుత్తెదార్లు – ఇతరత్రా ప్రయోజనం పొందిన వాళ్ళనుండి అణాపైసలతో సహా ముక్కుపిండి మరీ కక్కించిన తరవాత ఆ వాగ్ధానలను నేరవేర్చాలి.


“50 రోజులు సైకిల్‌ తొక్కి పార్టీ కోసం కష్టపడ్డా. చచ్చినా, బ్రతికి నా మీ కోసం, పార్టీ కోసమే పని చేస్తా” అని మదనపల్లి “భజనకొండ” కు చెందిన భజన పరుడు రెడ్డప్ప మాటలను విశ్వసించాల్సిన అవసరం ఏపి ప్రజలకు లేదు. కారణం ఆయన కష్టపడింది భజన చేసింది టిడిపి కోసం – ప్రజల కోసం కాదు. అని గమనించాలి. తోక పత్రిక సామాజిక వర్గ పక్షపాతంతో రాసిన రాతలు ఇంకా టిడిపి, చంద్రబాబు పుట్టిముంచటం తప్ప వేరే ప్రయోజనం ఉండదని విశ్లేషకుల భావన. అతి చిన్నసైజు ప్రతిపక్షంలో పడిపోయినా నాలుగు దశాబ్ధాల అనుభవం-మళ్లి మొదలెట్టింది తన శ్రీచంద్రనీతులు.

tokapatrika-srichandra-neetulu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పులిని వేటాడాలంటే వేచి చూచి వేటెయ్యాలి! నోటికి పని చెపితే అది నాకేస్తుంది
కేసీఆర్ జన ధిక్కారం - ఆర్టీసి బంద్ కాస్తా సకల జనుల సమ్మెగామారి విజయవంతం
రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!
‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ గవర్నర్ ప్రశ్నకు సంకటంలో పడ్డ కేసీఆర్ ప్రభుత్వం!
రఘురాం రాజన్ కౌంటర్ కు నిర్మలా సీతారామన్ ఎన్-కౌంటర్
కియారా అద్వాణి దెబ్బకు అమాంతం పెరిగిన సెక్స్-టాయ్స్ సేల్స్!
సైరా నిజం బడ్జెట్ చెపితే చాలు - సినిమా బ్రేక్ ఈవెన్ ఏం ఖర్మ – లాభాలే వస్తాయి!
"బజాజ్-చేతక్" స్కూటర్లలో రారాజు మళ్ళి వస్తుంది: 'చేతక్' అంటే ఏమిటో తెలుసా!
సుప్రీం కోర్టులో న్యాయవాది దౌర్జన్యం...కలత చెందిన న్యాయమూర్తులు - సీజేఐ ఆగ్రహం
దేశ ఆర్ధిక శాఖ మంత్రి ఇంట్లో 'ఆర్ధిక మాంద్యం' ..... తంటా!
పాఠశాలల్లో లైంగిక విఙ్జాన పాఠ్యాంశం తప్పనిసరి కానుందా?
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి–బోల్తాపడ్డ-కేసీఆర్ కి..షాక్!
పివి నరసింహారావు - మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలు భారత్ ను బంగారుబాటలో నడిపించాయా?
భారత్‌ ప్రయాణం ఇక నల్లేరు మీద నడకకాదు! ‘అంతర్జాతీయ మందగమనం’ వైపే!
About the author