నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  నిన్న ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు.  ఈరోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉపఎన్నిక ఉంటుంది.  అనంతరం గవర్నర్ ప్రసంగం ఉంటుంది.  దీని తరువాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి.  ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు.  

ఇదిలా ఉంటె, టీడీపీ లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా తక్కువ. ఎమ్మెల్యేలకు బాబు ఇప్పటికే కొన్ని సూచనలు చేశారు.  తన వాయిస్ కంటే ఎమ్మెల్యేల వాయిస్ ఎక్కువ వినిపించాలని సూచించిన సంగతి తెలిసిందే.  మిగతా ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నా.. బాలకృష్ణ సభలో ఎలా ప్రవర్తించబోతున్నారు.. 

ఎలా మాట్లాడబోతున్నారు.. అప్పట్లో రోజా సభలో ఉన్నన్ని రోజులు దడ పుట్టించింది.  రోజా బాటలోనే బాలకృష్ణ కూడా నడుస్తారా..? సభలో అధికార పక్షం మాట్లాడే సమయంలో ప్రతిపక్షాలు పోడియం వద్దకు వెళ్లి గొడవ చేయాల్సి ఉంటుంది.  దీనిని బాలకృష్ణ చేయగలరా..?

ఉన్నా లేకున్నా.. లేచి నినాదాలు చేయాలి.. బాలకృష్ణ ఇవి చేయగలరా... గత అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడింది తక్కువే.  సమస్యలపై చర్చించింది తక్కువే.  ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా వీటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.  మరి బాలయ్య ఎలా చేస్తాడో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: