Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 8:49 am IST

Menu &Sections

Search

క్యాడర్ కు భరోసానిచ్చే నాయకత్వమే కరువు

క్యాడర్ కు భరోసానిచ్చే నాయకత్వమే కరువు
క్యాడర్ కు భరోసానిచ్చే నాయకత్వమే కరువు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడప్పుడే కోలుకునే అవకాశాల్లేవా? అంటే అవుననే ఆ పార్టీ వర్గాల నుంచి సమాధానం విన్పిస్తోంది. క్యాడర్ కు భరోసానివ్వడం లో రాష్ట్ర నాయకత్వం ఘోరంగా విఫలమవుతోందని, అందుకే కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి నేతల  వలసలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున గెల్చిన 12 మంది శాసనసభ్యులు టీఆరెస్ లో పార్టీ లో చేరిన విషయం తెల్సిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడాన్ని కాంగ్రెస్ నాయకత్వం తప్పుపడుతోంది. అయితే తమని తప్పు పడుతోన్న కాంగ్రెస్ నాయకత్వం, పార్టీలోని ఇతర నేతలు పక్క పార్టీల్లోకి  వలసలు వెళ్తోంటే,  ఎందుకు నిలువరించలేకపోయిందో సమాధానం చెప్పాలని ఫిరాయింపు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, రేగా కాంతారావులు డిమాండ్ చేస్తున్నారు.


కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆనంద్ భాస్కర్, మాజీ మంత్రి డీకే అరుణ లు బీజేపీ లో చేరారని, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, భిక్షమయ్య గౌడ్ వంటి వారు టీఆరెస్ లో చేరారని, తమని పదవుల కోసం పార్టీ మారమని చెబుతోన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ,  వారిని ఎందుకు  నిలువరించ లేకపోయిందో  చెప్పాలన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వ లోపం వల్లే ఒకొక్కరుగా పార్టీ నేతలు పక్క పార్టీలోకి వెళ్తున్నారని చెప్పారు.  అధికార ఆపార్టీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు  పార్టీ ఫిరాయిస్తే, ఫిరాయించి ఉండవచ్చు కానీ వారు చెప్పిన దాంట్లో ఎంతోకొంత నిజం లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు.  


అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరువాత పార్టీ క్యాడర్ లో భరోసా నింపేందుకు పార్టీ నాయకత్వం తీసుకున్న చర్యలంటూ ఏమి లేవని వారు చెబుతున్నారు. దానికి తోడు పార్టీ లో ఒకరి నాయకత్వమంటే, మరొకరికి గిట్టదని, అందర్నీ కలుపుకుపోయే నాయకుడే కరువయ్యారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను, నాయకులను ఏకతాటి పై నడిపే నాయకుడు, ప్రస్తుతం కాంగ్రెస్ కు అవసరమన్నారు. అయితే ప్రస్తుతం కనుచూపు మేరలో ఆ తరహా నాయకుడు కాంగ్రెస్ పార్టీ కి కన్పించడం లేదని అంటున్నారు.


t-congress
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ కు మోడీ మార్క్ ఝలక్
సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ఏడు కమిటీలు ...
రచ్చబండ కార్యక్రమం  లక్ష్యం ఇదేనా ?
టీడీపీ చేసిన తప్పే ... బీజేపీ చేస్తోందా ?
అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజావేదిక తోనే ప్రారంభమన్న జగన్
టీడీపీ  మరో వికెట్ డౌన్ ... షాక్ లో చంద్రబాబు
టీడీపీ కి షాక్ ... పార్టీ వీడనున్న కాపు నేత
కొండే అవినీతిమయం ... ఇక తవ్వి నిరూపించాల్సింది ఏముంది ?
జగన్ వీరాభిమాని కి తగ్గిన సినిమా అవకాశాలు...
వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడంటే ...
నేను పోర్న్ స్టార్ ని  కాదంటున్న   షకీలా
ఆ పదవి స్వీకరించాలంటే హోదా ఇవ్వండంటున్న జగన్
ప్రజావేదిక నిర్మాణం లోను పెద్ద మొత్తం   అవినీతి
వైఎస్ కుటుంబ వీరాభిమానికి ఉన్నత పదవి
టీజీ భరత్ పార్టీ మరకపోవడానికి కారణం ఇదేనా ?
నగ్నంగా నటించడానికి శ్రమించిన హీరోయిన్
చంద్రబాబు చాణక్యుడా ...  చేతగాని  చవటో  తేల్చండి
పవన్ కు అండగా నేనుంటా
రోజాకు మంత్రి పదవి అన్నది  కలేనా?
బాబు రిక్వెస్ట్ బుట్ట దాఖలే ...
బాబు కు తప్పని శల్య పరీక్ష ...
రెండవ పెళ్లి చేసుకున్న అల్లు వారి అబ్బాయి
టీడీపీ కి వెన్నుపోటు పొడవడం పెద్దల సభ్యులకు అలవాటే
బాబు పై సుజనా షాకింగ్ కామెంట్స్
బీజేపీ లోకి 15 మంది ఎమ్మెల్యేలు ?...నిట్టనిలువునా చీలనున్న టీడీపీ ఎల్పీ ??
వైకాపా దానికి మినహాయింపు ... అదే జగన్ ప్రత్యేకత
అదను చూసి హ్యాండ్ ఇచ్చిన బాబు సామాజికవర్గ నేతలు
బాబుకు షాక్ ఇచ్చేందుకు  బీజేపీ   స్కెచ్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.