స్కూల్ విద్యార్థులకు వేసవి సేలవలు పూర్తి అయ్యాయి. ఇక స్కూల్లు ప్రారంభమైనప్పటికి పిల్లలకు అవసరమైన బ్యాగులు, పెన్నులు, పుస్తకాలు కొనాలి. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారికి ఇవన్ని కొనాలంటే దాదాపు రూ.2వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక ప్రైవేటు స్కూళ్ళ విషయానికి వస్తే ఈ ఖర్చు రూ.10వేలకు మించి పోతుంది.

ఇక నారాయణ స్కూల్ యాజమాన్యం రూపొందించిన పుస్తకాల ధరలు తెలిస్తే ఎవరైనా నోళ్ళు వెల్లబెట్టాల్సిందే. ఎల్కేజి పుస్తకాలే 4వేల రూపాయలు ఉండటం విశేషం. ఇంకా మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు వేలకు వేలు పెంచుకుంటూ తల్లిదండ్రుల మీద గుద్దిబండ మోపుతున్నారు.

నారాయణ స్కూల్ ఫీజులే అధికంగా ఉంటే ఈ పుస్తకాలు ధరలు తల్లిదండ్రులకు కంటతడిపెస్తున్నాయి. నారాయణ యాజమాన్యం మా స్కూల్ అన్ని స్కూల్ లాగా ఉండదని మాది గ్లోబలైజేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటూ ఊదరకొడుతూ తల్లిదండ్రుల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను అందించాలని ఇలాంటి ప్రైవేట్ స్కూలల్లో చేర్పించి అప్పులపాలవుతున్నారు. ఎక్కువుగా మద్యతరగతి ప్రజలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్ ను ఆశ్రయించి ఉన్నదంతా ఊడ్చిపెడుతున్నారు.ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేకపోవడం డిస్ప్లైన్ ఒరవడిదని ప్రైవేట్ స్కూల్స్ ను ఆస్రయిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: