2019 ఎన్నికల్లో భారీ లాస్ అయ్యింది ఎవరు అంటే ఖచ్చితంగా పవన్ అనే చెప్పాలి.  కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు.  132 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్కటి మాత్రమే గెలుచుకున్నారు.  కనీసం పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల్లో గెలవలేకపోయారు.  

ఎమ్మెల్యేగా గెలిచి ఉంటె ఆయనకు గౌరవం దక్కేది. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన తారక రామారావు, చిరంజీవిలు పార్టీలు పెట్టి.. గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. వీళ్లిద్దరి కంటే యూత్ లో పవన్ కు మంచి పేరుంది.  అలాంటి పవన్, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు అంటే అర్ధంకాని విషయం.  

పవన్ జనాల్లోకి వెళ్లి సమస్యల గురించి తెలుసుకొని ఆ సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  వచ్చే ప్రాదేశిక ఎన్నికల్లో కొంతమేరకైనా బలపడి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు పవన్.  ఒక్కడుగా పవన్ పోరాటం చేయగలడా అన్నది తెలియాలి.  

అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపించేందుకు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.  ఒక్క ఎమ్మెల్యే ఎంతవరకు సాధించగలడు.  ఇప్పటి నుంచే పవన్ ప్రజల్లోకి వెళ్తే.. ప్రజల నుంచి వచ్చే ఎన్నికల నాటికి మద్దతు లభిస్తుంది.  లేదంటే మాత్రం పవన్ కు ఇబ్బంది తప్పదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: