వైకాపా అధికారంలోకి వస్తే రైతుల సమస్యలు తీరుతాయని అనుకున్నారు.  రైతు రునామామాఫీ అమలు జరుగుతుంది.. రైతులు చక్కగా ఉండొచ్చని ఊచించారు.  చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్నికల్లోకి వచ్చే ముందు రుణమాఫీ పధకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.  

వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ రుణమాఫీని అమలు చేస్తారేమో అని రైతులు కొంతమంది మంత్రిని కలిశారు.  రైతుల రుణాల మాఫీపై ఆయన ఖచ్చితమైన సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.  రైతు రుణాల మాఫీ చేయడం కష్టం అని.. అది కుదరని పని అని తేల్చి చెప్పారు.  

అంతేకాదు, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తాము నెరవేర్చలేదని.. అమలుకు సాధ్యం కానీ పధకం అని చెప్పిన మంత్రి, రైతు భరోసా పధకం కింద రైతుకు 50వేలు, 4 వేల రూపాయల సబ్సిడీతో విత్తనాలు ఇస్తామని చెప్పారు.  జగన్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు.  

అంతకు రుణమాఫీ పధకం ప్రవేశపెట్టినపుడు అది అమలుకు సాధ్యం కాదని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.  అమలు చేయాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలని లోటు బడ్జెట్ లో ఉన్న ప్రభుత్వం దానిని అమలు చేయలేదని అన్నారు.  ఇప్పుడు అదే జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: