తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తరువాత ఆయనకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారు.  ఎమ్మెల్యేగా ఓడిపోయినా రేవంత్ తన పదవిని సమర్ధవంతంగా నిర్వహించారు.  ఎంపీగా గెలిచిన తరువాత రేవంత్ పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉండటంతో ఆలోచనలో పడ్డారు.  

ఇప్పుడు మరో వార్తకూడా బయటకు వచ్చింది.  కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డిలు బీజేపీలో చేరబోతున్నట్టు సమాచారం.  ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియదు.  ఇటీవలే ఈ ఇద్దరు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలవడంతో ఈ వార్తలు బయటకు వచ్చాయి.  

ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు జగ్గారెడ్డి.  రేవంత్ రెడ్డి పార్టీ మారబోతున్నట్టు వార్తలు వచ్చిన కొద్దీ సేపటికే జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరం. రేవంత్ రెడ్డి నిజంగానే పార్టీ మారుతున్నారా..?

వార్తలు వస్తున్నాయి కానీ, అందులో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియడం లేదు.  వార్తల్లో నిజం ఉండొచ్చో ఉండకపోవచ్చు.  క్లారిటీగా తెలుసుకోకుండా అప్పుడే డెసిషన్ తీసుకుంటే ఎలా అని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: