జాతీయ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.  బీజేపీ తన పార్టీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టె విధంగా మారబోతున్నది.  బీజేపీ జాతీయ రాజకీయాల్లో ఎత్తులు వేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న అమిత్ షా.. తన పదివీకాలం 2018 డిసెంబర్ తో ముగిసినా ఎన్నికల కారణంగా ఆ పదవిని పొడిగించారు.  

ఈరోజు కొత్త అధ్యక్షునికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది.  అయితే, తాజా సమాచారం ప్రకారం.. మరో కొన్ని నెలల్లో మహారాష్ట్ర తో సహా కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ సమయంలో అమిత్ షా జాతీయ అధ్యక్షుడిగా లేకుంటే ఇబ్బంది వస్తుందని భావించిన పార్టీ ఆయనకే పగ్గాలు అప్పగించేందుకు సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి. 

ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.  ఒక వ్యక్తికీ ఒక పదవి అనే సిద్దాంతం బీజేపీది.  ఇప్పుడు అమిత్ షా కోసం దాన్ని మార్చుతుందా. మారిస్తే అన్ని మార్చాల్సి వస్తుంది.  సిద్ధాంతాలకు అనుగుణంగానే పార్టీ నడుస్తూ వస్తున్నది.  

మార్చేందుకు అసలు బీజేపీ అసలు ఒప్పుకోదు.  కాకపోతే వెసులుబాటు కల్పించి కొంత సవరణలు చేసే అవకాశం ఉంది.  అమిత్ షా ప్లేస్ లో ఆ స్థాయి నాయకుడు పార్టీలో ఉన్నా ఇంకా వాళ్లకు అంతటి అనుభవం రాలేదన్నది పార్టీ వాదన.  అందుకే అమిత్ షా ను మరో మూడేళ్లు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: