అసెంబ్లీలో స్పీకర్ ను ఎన్నుకున్నాక ఆయనను మర్యాదపూర్వకంగా స్పీకర్ చైర్ వరకు తీసుకెళ్లడం ఆనవాయితీ.  అధికార పక్షంనాయకుడు, ప్రతిపక్ష నాయకుడు తీసుకెళ్లి స్పీకర్ చైర్లో కూర్చోపెడతారు.  ఇది సంప్రదాయం.  పర్సనల్ గా ఎన్ని గొడవలు ఉన్నా.. అసెంబ్లీ దగ్గరికి వచ్చే సరికి సహకరించాలి.  

కానీ, ఈరోజు అసెంబ్లీలో దీనికి పూర్తి రివర్స్ జరిగింది.  అధికారంలో ఉన్న జగన్ స్పీకర్ తమ్మినేని సీతారాం ను తీసుకురావాల్సిందిగా కోరగా.. జగన్ తమ్మినేని సీతారాం ను తీసుకెళ్లారు.  బాబు మాత్రం ఆ సీట్లో నుంచి లేవలేదు.  అలానే కూర్చొని ఉన్నాడు.  

టిడిపి తరపున అచ్చంనాయుడు తమ్మినేని వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా నమస్కారం చేసి వచ్చాడు.  బాబు చేసిన ఈ పని సభా మర్యాదను పోగొట్టింది.  అధికార పక్షానికి ఒక ఆయుధం దొరికినట్లయింది.  బాబు చేసిన పనిపై అందరు విమర్శలు చేస్తున్నారు.  

సభా మర్యాద గురించి గతంలో మాట్లాడిన బాబుగారు, ఈసారి ఆ మర్యాదను తప్పారని, సభా సంప్రదాయాలను పక్కన పెట్టడం బాగాలేదని జగన్ అన్నారు. జగన్ తో పాటు మరికొంతమంది నేతలు కూడా బాబుపై విమర్శల వర్షం కురిపించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: