యువకుడు నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి సాంప్రదాయాలు తెలివంటే నిజమేకదా! నేర్చుకుంటాడులే! అని వదిలేస్తారు. అదే బాబు చేస్తే అనుభవఙ్జుడి చిన్న మెదడు చితికిపోయిందా? అంటారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన  శాసనసభలో ప్రతిపక్షనేతగా హుందాతనాన్ని విస్మరించారు. 


ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ సభాపతిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే. తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన “ప్రొటెం స్పీకర్” చిన అప్పల నాయుడు, సభా నాయకుడు, ఇతర పార్టీల నాయకులు నూతన సభాపతిని మర్యాద, సాంప్రదాయ పూర్వకంగా ఆయన కూర్చొనే కుర్చీ వద్దకు తీసుకొని రావాల్సిందిగా ప్రకటించారు. 


ఈ సందర్భంగా సభలోనే ఉన్న ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చిత్రంగా ప్రవర్తించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, మంత్రులు స్వయంగా వెళ్లి స్పీకర్‌ ను అధ్యక్షస్థానంలో కూర్చొబెట్టగా చంద్రబాబు మాత్రం తన కుర్చీ నుంచి కదలకుండా, టీడీపీ నేతలను పంపించారు. ప్రతిపక్ష నాయకుడు కూడా వెళ్లి సభాపతిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. 


గత స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎన్నిక సందర్భంగా అప్పటి ప్రతిపక్నేత వైఎస్‌ జగన్  కూడా ఈ ఆనవాయితీని పాటించాడు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కోడెలను సభాపతి స్థానంలో వైఎస్‌ జగన్‌ కూర్చోబెట్టారు. తాజాగా చంద్రబాబు మాత్రం తాను వెళ్లకుండా, టీడీపీ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామా నాయుడుని పంపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవముందని, రాజకీయాల్లో తానే సీనియర్‌ అని చెప్పుకొనే చంద్రబాబు సభలో కనీస సంప్రదాయాలను, విలువలను పాటించక పోవడంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  లేకపోతే ఒక వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తికి గౌరవం ఇచ్చేదేముందని అనుకున్నా రేమో? అంటున్నారు ఆ వర్గం ప్రజలు. బాబుకు ఉంది కదా! సహజసిద్దమైన  కులగుల అంటున్నారు విశ్లేషకులు. 
 

అయితే, ఈ విషయంలో టీడీపీనేతలు వింత వాదనను తెరపైకి తీసుకొచ్చారు. స్పీకర్‌ను ఎంపికపై ప్రతిపక్షానికి సమాచారం ఇవ్వడం సంప్రదాయమని, అలాగే సభాపతిని కూర్చోబెట్టే సమయంలోనూ ప్రతిపక్షనేతను పిలవనేలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపణలు చేస్తున్నారు. 


టీడీపీ ఆరోపణలకు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ నేతలకు అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోయిందని, మీరు పాటించని సభా సంప్రదాయాల గురించి మాకు చెప్పకండంటూ హితవు పలికారు.  బలహీన వర్గాల నేత సభాపతిగా ఎన్నికైతే  మర్యాద పూర్వకంగా ఆయన స్థానానికి తీసుకువెళ్లాలన్న కనీస మర్యాదను చంద్రబాబు పాటించలేదని శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు.

సాంప్రదాయాలు “మీరు పాటించినప్పుడు లేదా పాటించి మాకు చెప్పకండి - మీరు పాటించని సభాసాంప్రదాయలను గుఱించి మాకు చెప్పకండి" అనేది వైసిపి వారి సాంప్రదాయం అవుతుంది. అయినా సాంప్రదాయాల్ని మాట్లాడే హక్కు చద్రబాబు కెక్కడిది. 23మంది ప్రతిపక్ష ఎమెల్యేలను గోడ దూకించి అందులో నలుగురికి మంత్రి పదవులిచ్చిన చరిత్ర వినిపిస్తారు ప్రజలు. చక్కగా ఉంటేనైనా మరోలాగా గౌరవందక్కుతుంది. సభాసాంప్రదాయాలను ప్రశ్నించే అర్హత టిడిపి ఏనాడో  కోల్పోయింది.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: