ఈ రోజు ఏపీ ఆసెంబ్లీలో ఒక అసక్తికరమైన ముచ్చట ఇది.స్పీకర్‌ స్థానంలో తమ్మినేని ఆసీనులైన తర్వాత మొదట సభా నాయకుడైన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తూ,' స్పీకర్‌ ఎంపిక ఆలోచన వచ్చినప్పుడు ఎన్నో విషయాలు గుర్తుకువచ్చాయి. ఇదే శాసనసభలోనే విలువల్లేని రాజకీయాలు చూశాం. చట్టాలకు తూట్లు పొడుస్తూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయని, దిగజారిన వ్యవస్థను ఇదే చట్టసభలో చూశాం.

కానీ, నేను కూడా అటువంటి అన్యాయమైన సంప్రదాయాన్నే పాటిస్తే మంచి ఎక్కడా బతకదు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వారికి అక్షరాల 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ముగ్గురు ఎంపీలను కొన్నవారికి మూడు ఎంపీ సీట్లే వచ్చాయి. చంద్రబాబు నాయుడికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. అందులో ఐదుగురిని లాగేస్తే.. ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఉండదు..

లాగేద్దామని కొందరు నాతో చెప్పారు. అలా చేస్తే నాకు ఆయనకు తేడా లేకుండా పోతుంది. అటువంటిది ఎప్పుడైనా జరిగితే.. ఆ పార్టీలోంచి ఎవరినైనా మేం తీసుకుంటే.. వారితో రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. అలాంటిది పొరపాటున జరిగితే.. వెంటనే డిస్కాలిఫై చేయండి' అంటూ, వైఎస్‌ జగన్‌ స్పీకర్‌ను కోరారు. 


ఈ మాటలు ఇపుడు రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యాయి. అంటే మోడీ నుండి కేసీఆర్‌ వరకు ఫిరాయింపులు అనే అంశాన్ని అత్యంత సహజమైన రాజకీయ ప్రక్రియగా చూస్తున్న దశలో ఏమాత్రం రాజకీయ అనుభవం లేని నాయకుడు జగన్‌ అని టీడీపీ తేలికగా తీసిపారేసిన యువ నాయకుడు  '' కష్టమైనా, నష్టమైనా ఫిరాయింపులను ప్రోత్సహించం...'' అసెంబ్లీ సాక్షిగా చెప్పడాన్ని దేశమంతా జేజేలు పలుకుతోంది.


జగన్‌లోని ప్రజాస్వామిక స్ఫూర్తిని రాజకీయ విశ్లేషకులు కొనియాడుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ని విలీనం చేసుకునే పనిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకే కాదు, కేసీఆర్‌,మోడీకి కూడా జగన్‌ ఒక పాఠం చెప్పారని, అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: