అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ప్రతిపక్షనేత చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ మొత్తం 175 స్థానాల్లో చరిత్ర సృష్టిస్తూ 151 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకూ అధికారంలో ఉన్న తెలుగుదేశం కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. 


తెలుగుదేశం పార్టీ ఎంత దారుణంగా ఓడిపోయిందంటే.. మరో ఐదు సీట్లు తక్కువ వచ్చి ఉంటే.. ప్రతిపక్ష హోదా కూడా దక్కేది కాదు. ఇప్పటికైనా జగన్ తలచుకుంటే టీడీపీ నుంచి ఓ ఐదుగురిని వైసీపీలోకి జంప్ చేయించడం అంత కష్టమైన పనేమీ కాదు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కకూడదని జగన్ పట్టుబడితే.. అది నిమిషాల పని.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కూడా అదే మాట చెప్పారు. మీరు చేసినట్టు నేను చేయను.. వాస్తవానికి.. నేను నోరు తెరిచి చెప్పడం లేదు. నాతో ఎంత మంది టచ్ లో ఉన్నారో చెప్పడం లేదు.. సంతోషపడండి..అంటూ సింహ గర్జన చేశారు. 

చట్టసభల్లో ప్రతిపక్షం అన్నది ఉండాలని.. చంద్రబాబు నాయుడి గారికి ఆ సీట్లో కూర్చోబెట్టే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం.. టోటల్ గా సిట్యుయేషన్ మారాలని చెప్పి.. కొత్త సంప్రదాయం రావాలని మేం భావిస్తున్నాం.. అంటూ జగన్ చంద్రబాబుకు సూటిగానే చెప్పేశారు. 

జగన్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించను అన్నమాట ఊరట కలిగిస్తున్నా.. మీ పార్టీ వాళ్లు ఎంత మంది టచ్ లో ఉన్నారో చెప్పడం లేదు సంతోషించండి.. అన్న జగన్ మాటలు టీడీపీని కలవరపరుస్తున్నాయి. వచ్చే ఎన్నికల వరకూ పార్టీని బతికించుకోవడం ఎలా అన్నదే ఇప్పు డు చంద్రబాబు ముందున్న కర్తవ్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: