ఆంధ్రలో టీడీపీ పార్టీని వీడటానికి పెద్దతలకాయలందరూ సిద్ధంగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా వినిపిస్తున్న మాటలు. చంద్రబాబు అతి నమ్మకస్తుల్లో ఒకరైన మాజీమంత్రి నారాయణ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారని, ఒక్క నారాయణే కాదు.. మరికొందరు మాజీ మంత్రులు, తాజా ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. విజయవాడ ఎమ్మెల్యే కేశినేని నాని కూడా గోడ దూకేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. రోజుల వ్యవధిలో తేలే వ్యవహారం కాకపోయినా అధికారం అనే అండ కోసం టీడీపీ నేతలు పక్కచూపులు చూడాల్సిన పరిస్థితి కచ్చితంగా వస్తుంది.


అటు వైసీపీ డోర్స్ క్లోజ్ అని తేలిపోవడంతో అనివార్యంగా బీజేపీ పంచన చేరాల్సిన అవసరం టీడీపీ నేతలది. జగన్ ప్రభుత్వం నుంచి మద్దతులేకపోయినా, ఉన్నంతలో బీజేపీ సపోర్టుతో బండి నడిపించొచ్చని వీళ్ల భావన. అయితే ఈ ఎపిసోడ్ అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. చంద్రబాబు తన క్రిమినల్ బ్రెయిన్ తో ఈ ఆలోచన చేశారని అతని వ్యవహారం బాగా తెలిసినవాళ్లు చెబుతున్నారు.


అటు బీజేపీతో, ఇటు వైసీపీతో రెండు విధాలా చేటు కాబట్టి.. కావాలనే బాబు తన విశ్వసనీయుల్ని కమలదళంలోకి పంపుతున్నారట. టీడీపీతో లేని విభేదాలు కొనితెచ్చుకుని వీరంతా బీజేపీకి జై కొడతారన్నమాట. ఐదేళ్ల తర్వాత పరిస్థితుల్నిబట్టి మళ్లీ పథకంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఈలోగా బీజేపీలోని తన వర్గంతో పనులు చక్కబెట్టుకోవాలనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్. తనకు లాభం లేకపోయినా.. నష్టం జరిగే పనుల్ని అయినా నివారించుకోవచ్చనే ఆలోచనతోనే చంద్రబాబు ఇలా తన వర్గాన్ని ఒక పథకం ప్రకారం బైటకు పంపిస్తున్నారట. అయితే అక్కడ అంతకంటే అపరచాణిక్యులు ఉన్నారు. అమిత్ షాలాంటి మేథావులు బీజేపీకి కాపలాగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: