చేసిన పాపాలు ఊరికే ఎక్కడికి పోతాయని పెద్దల సామెత ఒకటి ఉంది. ఇప్పుడు కోడెల ఫ్యామిలీ పాపాల చిట్టా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోయారు. ఇప్పుడు అధికారం పోయింది. జగన్ పవర్ లోకి వచ్చారు కోడెల పాపాల చట్టాల బయటికి వస్తుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో కే ట్యాక్స్ (కోడెల పన్ను) వసూలు చేశారని.. వారి దందాల చిట్టా ఊహించనంత పెద్దదిగా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.


ఇప్పటికే కోడెల ఫ్యామిలీపై వచ్చిన విమర్శలు.. ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. కోడెల కుమారుడు.. కుమార్తెపైన వచ్చిన ఫిర్యాదుల్లో పలు అంశాల మీద పోలీసులు కేసులు కట్టిన పరిస్థితి. పలువురు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో కోడెల సంతానాన్ని విచారించేందుకు పోలీసులు వారి ఇళ్లకు ఫోన్లు చేసినా స్పందన లేని పరిస్థితి. తమను బెదిరించి సొమ్ములు వసూలు చేసిన తీరును ప్రశ్నిస్తున్న వారి తీరుకు దడిసి.. వారిప్పుడు ఊరి నుంచి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. 


అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతున్న తీరుతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తమ కుటుంబంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. తగిన ఆధారాలు చూపించాలని కోడెల నిన్న మీడియాతో మాట్లాడటం గమనార్హం. ఆయన మాట్లాడిన తర్వాత.. ఆయన కుమారుడు.. కుమార్తె కనిపించకుండా పోవటం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: