అసెంబ్లీలో చంద్రబాబునాయుడుపై  వైసిపి సభ్యురాలు రోజా ఫుల్లుగా ఫైరయిపోయారు. స్పీకర్ గా ఎన్నికైన తమ్మినేని సీతారామ్ ను అభినందించే సందర్భంలో మాట్లాడుతూ సంప్రదాయాల గురించి చంద్రబాబా మాట్లాడేది అంటూ మొదలుపెట్టారు. అలాగే టిడిపి సభ్యుడు అచ్చెన్నాయుడు వ్యవహార శైలిని కూడా ఎండగట్టారు.

 

గడచిన ఐదేళ్ళల్లో తన విషయంలో చంద్రబాబు కక్షగట్టి ఏ రీతిలో వ్యవహరించింది వివరించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి తన గొంతు సభలో వినపడకుండా ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయంపై చంద్రబాబును నిలదీశారు.

 

హై కోర్టు, సుప్రింకోర్టులు తన సస్పెన్షన్ ను తప్పుపట్టినా న్యాయస్ధానాల ఆదేశాలను కూడా తుంగలో తొక్కిన చంద్రబాబు కూడా న్యాయం, ధర్మం, సంప్రదాయాల గురించి మాట్లాడటమేంటంటూ రెచ్చిపోయారు. అన్యాయంగా తనను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన చంద్రబాబు క్షమాపణ చెబుతారా ? అంటూ నిలదీయటం గమనార్హం.

 

తమ్మినేని స్పీకర్ గా ఎన్నికైనందుకు అచ్చెన్నాయుడుకు కడపు మండిపోతోందంటూ ఎద్దేవా చేశారు. టిడిపి అధికారంలో ఉన్నపుడు వైసిపి సభ్యులను ఏ విధంగా అవమానించారో గుర్తుచేశారు. వైసిపి సభ్యులను అనరాని మాటలు అన్న అప్పటి టిడిపి సభ్యులు ఇపుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్న బంట్రోతు అన్న మాటను పట్టుకుని సభ సమయాన్ని వృధా చేస్తున్నట్లు రెచ్చిపోయారు. మొత్తానికి చాలా కాలం తర్వాత సభలో మాట్లాడిన రోజా తనకిచ్చిన సమయాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నారనే చెప్పాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: