తెలుగుదేశం పార్టీ అసేలే గెలిచింది 23 మంది. దాంట్లో కూదా ఎవరూ సవ్యంగా అయిదేళ్ళు విపక్ష స్థానంలో కూర్చునే సీన్ లేదు. నిన్న ప్రమాణం నాడు వచ్చిన వారు ఈ రోజు రాలేదు. అంటే సగటున సభలో టీడీపీ తరఫున బాబుతో పాటు  హాజరయ్యేవారు పది మంది ఉంటారనుకోవాలి. ఈ సంగతి ఇలా ఉంటే


ముఖ్యమంత్రి జగన్ నిండు అసెంబ్లీలో బాంబ్ పేల్చారు. చంద్రబాబుకు ప్రతిపక్ష స్థానం అలా ఉందంటే తన దయ అన్నారు. తాను కనుక తలచుకుంటే 23 మంది ఎమ్మెల్యేల్లో ఎవరూ కూడా అక్కడ మిగలరు అంటూ హాట్ కామెంట్స్ చేస్టారు. తాను చెప్పనంటూనే చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చంద్రబాబు ఎదుటే జగన్ బాంబు పేల్చేశారు.


దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలో బిత్తర పోవడం బాబు వంతు అయింది. తాను ఎవరి పేర్లు చెప్పనని, చంద్రబాబు మాదిరిగా వారిని తీసుకోనని, తమ వైపు రావాలంటే కచ్చితంగా రాజీనామా చేయాలని జగన్ స్పష్టం చేశారు. అంటే మొత్తానికి తమ్ముళ్ళు పక్క చూపులు చూస్తున్నారని జగన్ చెప్పేశారన్న మాట. దీంతో బాబు గుండెళ్ళో సరికొత్త గుబులు బయల్దేరింది.



మరింత సమాచారం తెలుసుకోండి: