రెండవ రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తదితరులు తమ్మినేనిని సభాపతి స్థానం వరకూ తోడ్కొని వెళ్లగా.. ఆయన సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు.


తదుపరి ప్రశంగాల పర్వప్రారంభమైంది. రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి స్పీకర్ సీతారాంకు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా సభలో సీఎం మాట్లాడుతూ... సౌమ్యూడైన తమ్మినేని శాసనసభకు ఆరుసార్లు ఎన్నికై మంచిపేరు తెచ్చుకున్నారు. చట్టసభలపై మళ్లీ నమ్మకం కలిగించాలనే సీతారామ్‌ను ఎంచుకున్నాం. వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆలోచించి స్పీకర్‌ ఎంపికపై నిర్ణయం తీసుకున్నాం. ‘‘ ఇదే శాసనసభలో విలువలు లేని రాజకీయాలు చూశాం. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనీయని సందర్భాలు చూశాం. పార్టీ కండువాలు మార్చించి మంత్రిపదవులు ఇచ్చిన వైనాన్ని చూశాం. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని తుంగలోకి తొక్కి సభ ప్రతిష్ఠను ఎలా దిగజార్చారో చూశాం. చివరకు స్పీకర్‌పై అవిశ్వాసానికి ఉన్న నిబంధనను అప్పటికప్పుడు మార్చడం చూశాం. 


నేను కూడా అలాంటి అన్యాయమైన సంప్రదాయం పాటిస్తే మంచి ఎక్కడా బతకదు. ఇన్ని విషయాలు ఆలోచించాకే నేను ఎలా ఉండాలన్న మీమాంస కలిగింది. నేను కూడా అలాంటి అన్యాయమైన సంప్రదాయం పాటిస్తే మంచి ఎక్కడా బతకదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని గుణాలు సీతారామ్‌లో సంపూర్ణంగా ఉన్నాయని నమ్ముతున్నా. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని అడిగితే పట్టించుకోలేదు. అనర్హత వేటు వేయని ప్రభుత్వంపై ప్రజలే అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన పార్టీకి అక్షరాలా 23 సీట్లే వచ్చాయి. ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేస్తే అక్షరాలా మూడే మిగిలాయి. దేవుడు ఎంత గొప్పగా స్క్రిఫ్టు రాస్తాడో దీన్ని బట్టి అర్థమైంది. అన్యాయం చేస్తే శిక్ష ఎలా ఉంటుందో దేవుడు చూపించారు. 


అవినీతి రహిత పాలన కోసమే మా ప్రభుత్వం కృషి చేస్తోంది. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు... బ్యాక్‌ బోన్‌గా మారుస్తామని చెప్పాం. అందుకే మంత్రి మండలిలో 60శాతం వారికే అవకాశం ఇచ్చాము. ఉప ముఖ్యమంత్రులుగానూ బీసీలనే నియమించాం.  దేశానికే ఆదర్శం కావాలని కోరుకుంటూ తమ్మినేనికి అభినందనలు. తెదేపాలో కొంతమందిని లాక్కుందామని నాకు చాలామంది చెప్పారు.  తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేద్దామని అడిగారు. అలా చేస్తే వాళ్లకు, మాకు తేడా ఏం ఉంటుంది. పార్టీ మారాలనుకుంటే తప్పనిసరిగా ఆ పదవికి రాజీనామా చేసి రావాల్సిందే’’ అని సీఎం స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: