ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళకు మరో బంపర్ ఆఫర్  ప్రకటించే  అవకాశం ఉంది. జగన్ ఇప్పటికే  నాలుగున్నర లక్షల గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు ప్రకటించారు.   ప్రతి 60 కుటుంబాలకు  ఒక వాలంటీర్ ని నియమించనున్నారు.

 

ఇప్పటికే ఈ గ్రామ వాలంటీర్ ఉద్యోగాలపై నిరుద్యోగుల్లో చాలా ఆసక్తి నెలకొంది ఉన్న ఊర్లో  ఉద్యోగం,   నెలకు ఐదు వేల వేతనం గ్రామంలో పరపతి ఈ  ఉద్యోగాల పట్ల ఆకర్షణ  పెంచాయి.  ఎలాగైనా ఈ ఉద్యోగం సంపాదించాలని ఇప్పటికే చాలా మంది ప్రయత్నాలు ప్రారంభించారు.

 

 ఈ సమయంలో  జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగాల్లోలో  50 శాతం  మహిళలకు కేటాయించాలని  నిర్ణయించారు.  ఇదే కనుక  అమలైతే మహిళల్లో జగన్ గ్రాఫ్ అమాంతం పెరిగి పోవడం ఖాయం. 

 

ఈ గ్రామ వారంటే ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్ల వరకు వయోపరిమితి  నిర్ణయించే అవకాశం ఉంది. ఇకపై ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని వాలంటీర్ ద్వారానే గ్రామాల్లో అమలు చేయనున్నారు.  జగన్ తాజా నిర్ణయం ప్రకారం దాదాపు రెండున్నర లక్షల మంది మహిళలు  గ్రామ వాలంటీర్లుగా నియమించబడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: