ప్రమాణస్వీకార పత్రం ఒక ఫార్మాట్ లో ఉంటుంది.  అదే ఫార్మాట్ లో అందరు చేయాలి.  ఒకవేళ తెలుగు చదవడం రానివాళ్ళు ఇంగ్లీష్ లోనో లేదంటే ముందుగా ప్రిపేర్ అయ్యో వస్తారు.  ప్రిపేర్ అయ్యి అచ్చి చదువుతారు.  అంతేకాని సభలో నవ్వులపాలు కారు.  తెలుగు చదవడమే రాని వ్యక్తి ఎలా ఎమ్మెల్యే అవుతారు అని విమర్శలు చేస్తారు.  ఆ విమర్శలు కేవలం ఆ ఎమ్మెల్యేకే కాదు.. ఆ పార్టీకి, ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా వర్తిస్తాయి.  

ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసే రోజున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తూ దైవసాక్షిగా.. వైఎస్ జగన్ సాక్షిగా అంటూ ప్రమాణస్వీకారం చేశారు.  దీంతో ఆయన మరోసారి ప్రమాణస్వీకారం చేయాల్సి వచ్చింది.  ఈ వీడియో నిన్నటి రోజున వైరల్ గా మారింది.  

ఇదిలా ఉంటె, ఈరోజు ఓ వీడియో బయటకు వచ్చింది.  అది లేటుగా బయటకు వచ్చింది.  చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎం బాబు ప్రమాణస్వీకారం చేసే సమయంలో తడబడ్డారు.  తడబడటం అంటే మాములుగా కాదు.  పాపం ఈ ఎమ్మెల్యేకు తెలుగు చదవడం రాదు  అనుకుంటా.. ఒక్కో అక్షరాన్ని కూడబలుక్కొని చదివాడు.  అదికూడా సరిగా చదవలేదు.  

అంతగా తెలుగు చదవడం రాకపోతే వేరే ఫార్మాట్లో కూడా చదవవొచ్చు.  అందులో తప్పులేదు.  కానీ, ఇలా తప్పులు చదివితే ఎలా.. పాపం అనవసరంగా ఇలా సోషల్ మీడియా కు చిక్కి అనేక ఇబ్బందులు పడుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: